తెలంగాణ‌

KTR: ఏపీలో నీళ్లు, కరెంట్ వంటి విషయాలపై కేటీఆర్ సెటైర్లు..!!

Share

KTR: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఏపీలో పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలు 2 తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు నీటి సౌకర్యం లేదని.. రోడ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి అని తెలిపారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి వచ్చిన తన స్నేహితులు చెప్పారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి.

ఈ క్రమంలో మన రాష్ట్రానికి చెందిన వాళ్లను నాలుగు బస్సులు తో.. ఏపీలో తిప్పితే తెలంగాణ పాలకుల విలువ ఏంటో తెలుస్తుంది అని స్నేహితులు అన్నట్టు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెను దుమారాన్ని రేపాయి. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆధారం చేసుకుని ఏపీలో వైసీపీ పార్టీల నేతలు.. సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా వరకు తెలంగాణలో టిఆర్ఎస్ ఏపీలో వైఎస్ఆర్ పార్టీ అధినేతలు కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా ముందు నుండి చాలా స్నేహంగా కొనసాగుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల టైంలో స్వయంగా జగన్ నివాసానికి కేటీఆర్ వెళ్లడం అప్పట్లో సంచలనం. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కూడా హాజరై రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అయ్యేలా వ్యవహరిస్తాం..ఏపీకి అని విధాలా సపోర్ట్ చేస్తాం అని మాట ఇచ్చారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్ అదేవిధంగా కేసీఆర్ పలు సందర్భాలలో కలసి రాణించారు. పరిస్థితి ఇలా ఉంటే ఒక్కసారిగా ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏపీలో పాలన పై నెగిటివ్ కామెంట్లు తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

అయితే ఇటీవల కేంద్రం విషయంలో టిఆర్ఎస్ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో బిజెపి ని టార్గెట్ చేసుకుని టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు గత కొద్దీ దినాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఏపీలో జగన్ మాత్రం బీజేపీ విషయంలో చాలా వరకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. దీంతో ఈ విషయంలో టిఆర్ఎస్ వైసీపీ పార్టీ మధ్య విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ విషయంలో చాలా కూల్ గా ఉండే టీఆర్ఎస్.. పార్టీ నేతలు ఒక్కసారిగా నెగిటివ్ కామెంట్లు చేయటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.


Share

Related posts

YS Jagan : జ‌గ‌న్ పైకి అస‌దుద్దీన్‌…. కేసీఆర్ కొత్త టార్గెట్ ?!

sridhar

MAA: మోహన్ బాబుపై దూషణ ఎఫెక్ట్ …నటి శ్రీనిజపై మా అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం..

somaraju sharma

Peddireddy: ఈటల ఎఫెక్ట్.. బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar