NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR : బ్రేకింగ్ : విశ్వసనీయంగా అందిన న్యూస్ : కే‌టి‌ఆర్ క్యాబినెట్ లో మంత్రులు వీళ్ళే ?

KTR : తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అంశం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆయన రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకుని కుమారుడు కేటిఆర్ కు సీఎం సీటు ఇచ్చేస్తారంటూ ఆ పార్టీ నేతలే ప్రచారం చేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి అయితే బహిరంగ వేదికలపైనే కాబోయే సీఎం కెటిఆర్ అంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కొందరు అడ్వాన్స్ గా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటి నుండి కేటిఆర్ తో సన్నిహితంగా మంత్రి పదవులు వస్తాయని కొందరు, మంత్రి పదవి పదిలంగా పది కాలాల పాటు ఉంటుందని కొందరు కేటిఆర్ భజన చేయడం ప్రారంభించారు.

KTR : these are ktr cabinet ministers ?
KTR these are ktr cabinet ministers

కేటిఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం డేట్, టైమ్ కూడా ఫిక్స్ అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (ఫిబ్రవరి) మూడవ వారంలో కేటిఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ విషయంపై ఇంత వరకూ కేసిఆర్ గానీ కేటిఆర్ గానీ బహిరంగంగా ప్రకటన చేయలేదు. కానీ ఊహాగానాలు సాగుతున్నాయి. అప్పుడే కేటిఆర్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు అనేదానిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసిఆర్ కేబినెట్ లో కేటిఆర్ కు ఎదురు చెప్పే వారు ఎవరూ లేరు. ప్రస్తుతం కేసిఆర్ మంత్రివర్గంలో ఉన్న వారు దాదాపుగా అందరూ ఆయనకు విధేయులుగా ఉన్న వారే. అయితే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పైకి చెప్పుకోకపోయినా పార్టీపై కొంత అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.  అయితే వారు తమ అసమ్మతిని బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారుట.

ఒక రోజు అటు ఇటు అయినా కేటిఆర్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ క్యాడర్ కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎప్పటి నుండో తెలుసు. ఈ కారణంగా మంత్రులు కేటిఆర్ తో వినయంగానే ఉంటూ వస్తున్నారు. కేటిఆర్ తనకు అత్యంత సన్నిహితులను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆకాంక్షించినా ఒకరిద్దరు తప్ప ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పుడు ఉన్న మంత్రులలో ఒకరిద్దరు తప్పించే అవకాశం ఉంటుంది కానీ పూర్తిగా కేసిఆర్ కేబినెట్ లోని మంత్రులను  తొలగించే అవకాశం లేదంటున్నారు. ఇది ఉండగా కేటిఆర్ క్యాబినెట్ లో తమకు బెర్త్ ఖాయం అంటూ పలువురు యువ ఎమ్మెల్యేలు, కేటిఆర్ సన్నిహతులు ఇప్పటి నుండే తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారని సమాచారం.

author avatar
Special Bureau

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?