తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ‌కు అప్పుడే టీఆర్ఎస్ పార్టీ రాజ‌కీయం ఒంట‌బ‌ట్టేసిందిగా!

Share

L.Ramana: తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇటీవ‌లే టీఆర్ఎస్ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరి వారం రోజులు కూడా కాక‌ముందే ఇప్పుడే ఆయ‌న‌కు టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌హార‌శైలి అబ్బింద‌ని ప‌లువురు కామెంట్లు చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన సంచ‌ల‌న ప‌థ‌కం గురించి ఎల్‌.ర‌మ‌ణ చేసిన వ్యాఖ్య‌లు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు అంటూ ర‌మ‌ణ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఈ కామెంట్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

Read More : L.Ramana: ఇదేంద‌య్యా ఇది…ర‌మ‌ణ వెళ్లిపోతుంటే… బాంబు కాల్చి సంబ‌రాలు చేసుకున్న టీడీపీ

చ‌రిత్ర‌లో మైలు రాయి…
ద‌ళిత బంధు ఈ పథకం చరిత్ర లో గొప్ప మైలు రాయిగా నిలిచిపోనుందని ఎల్‌.ర‌మ‌ణ జోస్యం చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన నేతగా కేసీఆర్ తరతరాలకు గుర్తుంటారని ఆయ‌న కొనియాడారు. ద‌ళిత బంధు పథకాన్ని త‌మ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి కృతజ్ఞతలు అని ర‌మ‌ణ ప్ర‌శంసించారు. హుజురాబాద్ నుంచి ప్రారంభించిన రైతు బంధు పథకం విజయవంతం అయినట్టే దళిత బంధు కూడా విజయవంతమవుతుందని ఎల్. ర‌మ‌ణ పేర్కొన్నారు.

Read More : KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

ర‌మ‌ణ‌కు అప్పుడే రాజ‌కీయం వ‌చ్చేసిందిగా…

టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ .రమణ వెంట‌నే పార్టీ రాజ‌కీయాల‌ను నేర్చుకున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన ప‌థ‌కం ఇంకా అమ‌ల్లోకి రాలేదు, ల‌బ్దిదారులకు ప్ర‌యోజ‌నాలు అంద‌న‌ప్ప‌టికీ అప్పుడే కొంద‌రు నేత‌లు ఈ ప‌థ‌కం ఆహా ఓటో అంటూ ప్ర‌శంసిస్తుంటే… అందులో ర‌మ‌ణ సైతం చేరిపోయార‌ని… ఈ లెక్క‌న త్వ‌రగానే ర‌మ‌ణ‌కు అధికార పార్టీ రాజ‌కీయాలు తెలిసిపోయాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Related posts

Anitha: ఫేడౌట్ అయిన అనిత ఇప్పుడు గ్లామర్ పిక్స్ పెట్టి ట్రై చేస్తే టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఛాన్స్ ఇస్తారా..?

GRK

వామ్మో.. బెల్లంకొండ చిన్నోడు కాదు.. నభా నటేశ్ ను ఎలా ఆడుకున్నాడో చూడండి?

Varun G

Congress: ఈవీఎంలు వద్దు – బ్యాలెట్ యే ముద్దు .. ఈవిఎంలపై కాంగ్రెస్ రాజకీయ తీర్మానం

somaraju sharma