L.Ramana: తెలంగాణలో జరుగుతున్న హాట్ హాట్ రాజకీయాల్లో టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ పేరు ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ టీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్నందున ఇతర పార్టీల నేతలపై గురిపెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎల్.రమణ ను సంప్రదించిందని వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు స్పందించారు. అయితే, ఈ ప్రకటన క్లారిటీ కంటే కన్ఫ్యూజ్ గా ఉందని అంటున్నారు.
Read More: L.Ramana: బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్లోకి ఎల్.రమణ…
రమణ పరిస్థితి ఇది…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో రమణ మంత్రిగా పనిచేశారు. దీర్ఘకాలంగా టీడీపీలో ఉన్న ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఎల్. రమణతో ఆ పార్టీ నేతలు మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఎల్.రమణకు టీఆర్ఎస్ నేతలు ఫోన్ చేసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. ఎల్ రమణకు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరిగింది.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
రమణ ఏమంటున్నారంటే…
అయితే, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తనకు ఇటీవల ఫోన్ చేసి సీఎం కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేసారని అన్నట్లు ఎల్ రమణ తెలిపారు. టీఆర్ఎస్ నుంచి గతంలో కూడా ఆఫర్ వచ్చిందని పేర్కొన్న రమణ తాజా ప్రతిపాదన కొత్తదేం కాదని అన్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల తనను కలిసి రాజకీయ భవిష్యత్ గురించి ఏం ఆలోచిస్తున్నారని అడిగారని రమణ వివరించారు.
పార్టీ మార్పుపై ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేయలేదని పేర్కొన్న రమణ తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం అయిన తీసుకుంటానని వివరించారు. అయితే, తనకకోసం రెండు ఆఫర్లు వేచి చూస్తున్నాయని రమణ పేర్కొనడం రాజకీయ డైలమానా లేకపోతే తెలివైన వ్యూహమా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.