NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏం జ‌రుగుతోంది?: మోడీ చెప్పారు… కేటీఆర్ పాటించారు!

గ‌త కొద్దికాలంగా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మ‌ధ్య జ‌రుగుతున్న రాజ‌కీయం గురించి కొత్త చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీర్ ఢిల్లీ టూర్ త‌ర్వాత ఈ చ‌ర్చ మ‌రింత హాట్ హాట్ హాట్‌గా మారింది. బీజేపీకి టీఆర్ఎస్ ద‌గ్గ‌ర‌వుతోంద‌నే ప్ర‌చారం మొద‌లైంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అలాంటి వారికి మ‌రింత చ‌ర్చ పెట్టుకునే చాన్సిచ్చార‌ని అంటున్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ ఏం చేశారంటే…

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీకా వేయించుకుంటారని వార్తలు వచ్చాయి. గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన ఈటల.. వ్యాక్సిన్‌ మాత్రం తీసుకోలేదు… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మొదటి వాక్సిన్ పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన… తాను ముందుగా వ్యాక్సిన్‌ ఎందుకు తీసుకోలేదో వివ‌రించారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేసిన ఈటల.. ప్రాణ త్యాగం కూడా చేశారన్నారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు.. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చాము.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు.

మోడీ చెప్ప‌డంతోనే కేటీఆర్ ఇలా…

శ‌నివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్‌ విషయంలో ప్రదాని నరేంద్ర మోడీ సూచనలతోనే మేం ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. “ ముందుగా ప్రజా ప్రతినిధులు వాక్సిన్ తీసుకుని ప్రజల్లో నమ్మకం కలిగించాలని అనుకున్నాం. కానీ, కోవిడ్ వారియర్స్‌కే ముందుగా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రధాని మోడీ సూచనతో మేం కూడీ ఇప్పుడు వ్యాక్సిన్‌ తీసుకోవడం లేదు“ అని ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చే దాకా వేచి ఉంటామన్న ఆయన… హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ హబ్‌గా మారిందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాధ్య‌తాయుత‌మైన ప్ర‌జాప్ర‌తినిధిగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని కొంద‌రు పేర్కొంటుంటే… మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్‌ను మ‌రికొంద‌రు రాజ‌కీయ కోణంలో చూస్తుండ‌టం కొస‌మెరుపు!

author avatar
sridhar

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!