Eatela Rajendar: ఆ ఒక్క‌మాట‌తో లేచి… ఈట‌ల‌పై ఫైర‌వుతున్న క‌మ్యూనిస్టు పార్టీలు

Share

Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరిగి ఎట్ట‌కేల‌కు పార్టీకి రాజీనామా చేసే వ‌ర‌కు చేరింది. అయితే, పార్టీకి గుడ్ బై చెప్పేసిన‌ అనంత‌రం టీఆర్ఎస్ గురించి, ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ గురించి ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో క‌మ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ మార్గ‌నిర్దేశంలోనే ప‌నిచేస్తున్నాయంటూ ఈటల‌ రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ కామెంట్ల‌తో హ‌ర్ట్ అయిపోయిన క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇటు సీపీఐ అటు సీపీఎం తాజాగా ఈట‌ల‌పై విరుచుకుప‌డ్డాయి.

Read More: Eatela Rajendar: ఈట‌ల రాజీనామా ఎపిసోడ్ తో కాంగ్రెస్ లో క‌ల‌క‌లం…

ఈట‌ల సిగ్గుప‌డాల్సిన విష‌యం…

వామపక్ష రాజకీయాలతో ప్రారంభమైన ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయ జీవితం లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి తాజాగా మతోన్మాద బీజేపీ పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం అని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తాను చేస్తున్న పని కప్పిపుచ్చేందుకు కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం అభ్యంతరకరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈట‌ల రాజేంద‌ర్‌ ప్రమాదకరమైన బీజేపీని ఎంచుకోవటం శోచనీయమ‌న్నారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల‌ని సూచించడం గ‌మ‌నార్హం.

Read More: Eatela Rajendar: కేసీఆర్ త‌ర్వాత ఈట‌లే… గులాబీ పార్టీ నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

ప‌చ్చి అవ‌కాశ‌వాది…

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌ పై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. టీఆర్ఎస్‌కు రాజీనామా సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో క‌మ్యూనిస్టుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. ఈటల పచ్చి అవకాశవాది అని ఆరోపించారు. బీజేపీలో చేరుతూ క‌మ్యూనిస్టుల‌ మీద నింద‌లు వేస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. అసైన్డ్‌ భూములు ఎవరు కొన్నా త‌ప్పేన‌ని పేర్కొన్న చాడా వెంక‌ట్ రెడ్డి ఈమేర‌కు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటు ఈట‌ల రాజేంద‌ర్ వెంటనే ప్రభుత్వానికి స‌ద‌రు అసైన్డ్‌ భూములు అప్పగించాల‌ని డిమాండ్ చేశారు.


Share

Related posts

Chandrababu : చంద్ర‌న్న బ్యాడ్ టైం … ఇది ఏపీలో కొత్త ప్ర‌చారంం

sridhar

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. ప్రాణాలు తీసుకున్నాడు.. ఎవరంటే?

Teja

ఈఎస్ఐ కుంభకోణం ప్రధాన సూత్రధారి అతనే…?

arun kanna