NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Elections: బ్యాలెట్ విధానంలోనే మా ఎన్నికలు..! స్పష్టం చేసిన ఎన్నికల అధికారి..!!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణల మాటల తూటాలతో హీట్ ఎక్కింది. బ్యాలెట్ విధానాన్ని విష్ణు ప్యానెల్ దుర్వినియోగం చేస్తోందంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపణలు చేశారు. మా ఎన్నికల నియమావళి ఉల్లంఘించి విష్ణు వర్గంకు చెందిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ లు సేకరిస్తున్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. దీనిపై ఆయన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను మంచు విష్ణుఖండించారు. ఇదే నేపథ్యంలో మంచు విష్ణు తమకు ఈవీఎం ద్వారా ఎన్నికపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్న విష్ణు ఈ మేరకు మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ రాశారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణమోహన్ ప్రకటించారు.

MAA Elections to be held in ballot mode
MAA Elections to be held in ballot mode

Read More: MAA Elections: చిరంజీవి పరువు – పెద్దరికానికి పరీక్ష ..! 900 ఓట్ల కోసం నడి బజారులులో సిని’మా”..! మా ఎన్నికల్లో ఇదో పెద్ద ట్విస్ట్..!!

MAA Elections:  బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు

ఎన్నికల అధకారి కృష్ణమోహన్ దీనిపై సలహా తీసుకునేందుకు కృష్ణంరాజుతో భేటీ అయ్యారు. విష్ణు, ప్రకాశ్ రాజ్ చేసిన ప్రతిపాదనలను అసోసియేషన్  క్రమశిక్షణా సంఘం చైర్మన్ కృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లారు. బ్యాలెట్ విధానంపై కృష్ణంరాజు మొగ్గు చూపారని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ తెలిపారు. అదే విధంగా సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్ పద్దతితోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రకాశ్ రాజ్ పై నిప్పులు చెరిగిన విష్ణు

మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరగనుంది. సుమారు 950 మందికిపైగా అసోసియేషన్ సభ్యులకు ఓటు హక్కు ఉండగా ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానెల్ సభ్యులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇదే క్రమంలో విష్ణు ప్యానెల్ పై ప్రకాశ్ రాజ్, ప్రకాశ్ రాజ్ పై విష్ణు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో మా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా పరిస్థితులు మారాయి అని అంటున్నారు. అసోసియేషన్ లోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. సభ్యులకు హామీలు ఇచ్చి గెలవడానికి కృషి చేయాలే కానీ అడ్డదారులు తొక్కడం, అక్రమాలకు పాల్పడటం ఏమిటంటూ విష్ణు వర్గంపై ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. మరో పక్క మంచు విష్ణు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకాశ్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ గురించి అటు కర్నాటకలో, తమిళనాడులో అడిగితే తెలుస్తుందని అన్నారు. సంఘాలకు తాళాలు వేయించిన ఘనత ఆయనదని, ఐక్యంగా ఉన్న సంఘాల్లో గొడవలు సృష్టించిన చరిత్ర ఆయనది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri