Manchu Vishnu: ఇద్దరు సీఎంలు మంచుకి దూరమే..? విష్ణుపై జగన్, కేసిఆర్ తీవ్ర ఆగ్రహం..? పేర్ని నాని ద్వారా ఘాటు వార్నింగ్ ..?

Share

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచారు. ఓ పెద్ద తతంగం, ఒక 900 ఓట్ల కోసం భారీ యుద్దం చేసినట్లు, కురక్షేత్ర రణ రంగం చేసినట్లు, సార్వత్రిక ఎన్నికలు జరిగినట్లు భారీ బిల్డప్ ఇచ్చి మొత్తానికి మా ఎన్నికలు అయితే ముగిసాయి. నిజానికి మంచు విష్ణు పోటీ చేయకపోతే మా ఎన్నికల్లో అంత వేడి ఉండేది కాదు. వీళ్లు పోటీ చేశారు కాబట్టే వీర ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్ కారణంగా పోటీ తీవ్రత పెరిగింది, మీడియా ఫోకస్ పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత మోహన్ బాబు ఏమన్నారో ఒక సారి పరిశీలిద్దాం..ఇద్దరు సీఎంల ఆశీస్సులు అంటే అటు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఇటు తెలంగాణ సీఎం కేసిఆర్ ఆశీస్సులు మంచు విష్ణుకు ఉంటాయని మంచు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. పొలిటికల్ మైలేజీ కోసం రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలో సాన్నిహిత్యం కోసం  తన కుమారుడు విష్ణును పొలిటికల్ స్టార్ గా నిలబెట్టడానికి మోహన్ బాబు కొంత చాకచక్యంగా మాట్లాడారు. కాని వాస్తవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా ఎన్నికలను పట్టించుకోలేదు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మా ఎన్నికలకు ముందే ఒక వార్నింగ్ కూడా వెళ్లింది. మా ఎన్నికల విషయంలో ఏపి ప్రభుత్వానికి గానీ, సీఎం వైఎస్ జగన్ కు గానీ ఎటువంటి సంబంధం లేదనీ మంత్రి పేర్ని నాని స్వయంగా చెప్పారు.

Manchu Vishnu maa election politics
Manchu Vishnu maa election politics

Manchu Vishnu: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ గెలుపు కోసం పని చేసిన కెటిఆర్ టీమ్..?

నిజానికి తెలంగాణలో కేటిఆర్ టీమ్ ప్రకాష్ రాజ్ కోసం పని చేసింది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ తెలంగాణలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అడపదడపా కేటిఆర్ ను రెండు సార్లు కలిశారు. వాళ్లిద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడింది. కేటిఆర్ కు ప్రకాశ్ రాజ్ వ్యక్తిత్వం బాగా తెలుసుకాబట్టి కేటిఆర్ టీమ్ గానీ, టీఆర్ఎస్ వాళ్లు గానీ ప్రకాశ్ రాజ్ టీమ్ గెలుపునకు తెరవెనుక ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. అదే విధంగా మెగా ఫ్యామిలీ కూడా తెరవెనుక ప్రయత్నమే చేశారు. ఇక్కడ ప్రకాశ్ రాజ్ కు వచ్చిన మైనస్ అదే. నిజానికి మెగా బ్రదర్స్ నేరుగా తెరముందుకు వచ్చి ఇన్వాల్వ్ అయి చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ప్రకాశ్ రాజ్ గెలిచేవాళ్లు. ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇచ్చిన బిగ్ బిగ్ స్టార్స్ అందరూ తెరవెనుకే పని చేశారు కానీ తెరముందుకు రాలేకపోయారు. మంచు విష్ణు విషయానికి వచ్చేసరికి అందరూ తెర ముందుకే వచ్చారు. నరేశ్ లాంటి వాళ్లు బయటకు వచ్చి విష్ణుకు మద్దతు ఇవ్వడం, మోహన్ బాబు పూర్తిగా ఇన్వాల్వ్ అయి అందరికీ ఫోన్ లు చేసి పిలిపించడం, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్లను రప్పించి ఓటు వేయించడం జరిగింది. మోహన్ బాబు పిలుపుతో జలీలియో, జయప్రద లాంటి వాళ్లు ముంబాయి, ఢిల్లీ నుండి వచ్చి మా లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుకబడ్డ ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్ తనకు ఉన్న పరిచయాలతో ఆ విధమైన పోల్ మేనేజ్‌మెంట్ చేయలేకపోయారు. ఇకపోతే కేటిఆర్ మంచు విష్ణుకు వ్యతిరేకమే అని అంటున్నారు. వాళ్లు ప్రకాశ్ రాజ్ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేసినట్లు సినీవర్గాల నుండే వినబడుతోంది. మరో పక్క వైసీపీ ప్రభుత్వం ముందే చెప్పేసింది. తమకు ఏ మాతం మా ఎన్నికలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. దీనికి తోడు మంచు విష్ణుకు పూర్తిగా అండగా నిలబడింది కమ్మ సామాజికవర్గం. వాస్తవానికి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ.. కమ్మ సామాజికవర్గాన్ని ఆమడదూరంలో పెడుతుంది. అందుకే ఏపిలోని వైసీపీ పెద్దలు చాలా మంది కూడా ప్రకాశ్ రాజ్ గెలిస్తే బాగుంటుంది అని అనుకున్నారుట. అయితే ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరి కండువా కప్పుకోవడం, మంచు విష్ణు కూడా పలు పర్యాయాలు జగన్మోహనరెడ్డి ని కలవడం, బావ బావ అని చెప్పుకోవడం వల్ల సినీ ఇండస్ట్రీలో వైఎస్ జగన్ సపోర్టు ఉందేమో అన్న అపోహ ఉంది. అందుకే క్లారిటీ కోసం ఏపి మంత్రి పేర్ని నాని ఈ విషయంలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే మంచు విష్ణు గెలిచిన తరువాత ఏపి సీఎంఓ నుండి అభినందనలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి విషయంలోనూ సీఎం జగన్మోహనరెడ్డి పేరు ఉపయోగించుకోద్దని చెప్పినట్లు సమాచారం.


Share

Related posts

“రాధే శ్యామ్” ఫస్ట్ లుక్ లో సర్‌ప్రేజ్ కాదు ట్విస్టులు ఇచ్చాడు ప్రభాస్ ..!

GRK

అనుపమ అది వదలలేకపోతుందా …?

GRK

ఒక్క సినిమా లేదు.. కానీ ‘లాక్ డౌన్’లో భారీగా సంపాదించింది.. ఎలా అంటే?

Teja