తెలంగాణ‌ న్యూస్

Mango Videos: గౌడ సంఘం వివాదంపై స్పందించిన సింగ్ సునీత భర్త సంస్థ..వివరణ ఇదీ..

Share

Mango Videos: ప్రముఖ సినీ గాయని సునీత భర్త రామ్ కు చెందిన మ్యాంగో వీడియోస్ సంస్థ వద్ద ఇటీవల గౌడ సంక్షేమ సంఘం నేతలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. సింగర్ సునీత భర్త శ్రీరామ్ మ్యాంగో వీడియోస్ సంస్థ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి వాటిని యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుంటుంది. అయితే ఓ సినిమాలో గౌడ మహిళలను కించపరిచేలా ఉన్న సన్నివేశంపై గౌడ సంఘాలకు చెందిన కొందరు మ్యాంగో వీడియోస్ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు.

Read More: TDP Chandrababu: టీడీపీలోకి ఆ ఇద్దరు..!? గంటాకు విరుగుడు ఆలోచిస్తున్న బాబు..!!

Mango Videos: యూట్యూబ్ నుండి ఆ కంటెంట్ తొలగించాం

ఈ వివాదంపై తాజాగా రామ్ కు చెందిన మ్యాంగో వీడియోస్ సంస్థ అధికారికంగా స్పందించింది. ఈ నెల 24వ తేదీన తాము గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు కార్యాలయానికి వచ్చారనీ, ఒక సినిమా గురించి అభ్యంతరాలు వ్యక్తం చేశారని పేర్కొంది. ఆ కంటెంట్ ను యూట్యూబ్ నుండి తొలగించాలని వారు కోరారని సంస్థ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ తో థియేటర్ లలో విడుదలైందనీ, అయినప్పటికీ మహిళలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజే దాన్ని యూట్యూబ్ నుండి తొలగించామని పేర్కొంది. ఈ వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా పొరపాటున నొప్పించి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది.

Read More: TDP: వైసీపీ స్వీప్ జిల్లాలో టీడీపీకి రిజైన్.. బాబుని టెన్షన్ పెట్టిన ఆ ఇద్దరూ..!


Share

Related posts

‘జనసేన బరిలోకి విద్యావంతుల చూపు’

somaraju sharma

టీడీపీలో అసంతృప్తులు మొదలైనట్లేనా..? గుడ్ బై చెప్పిన గోదావరి జిల్లా నేత..!!

Special Bureau

Naga Chaitanya: నన్ను క్షమించండి సమంత తల్లికి చైతన్య క్షమాపణ …!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar