29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం .. ఇన్ చార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ రాజీనామా

Share

Breaking:  తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి పదవికి సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు తన రాజీనామా లేఖను మాణిక్యం ఠాగూర్ పంపారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలోని సీనియర్ నాయకులు పలువురు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటి నుండి అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు సీనియర్ లు రీసెంట్ గా పీసీసీ పదవుల నియామకం తర్వాత ప్రత్యేకంగా సమావేశమై మీడియా ముఖంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

manickam thakur

 

ఆ నేపథ్యంలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు చేరుకుని సీనియర్ నేతలతో సమావేశమై వారి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంలో సీనియర్ నేతలు మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దిగ్విజయ్ సింగ్ పార్టీ అధిష్టానంకు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రానికి కొత్త ఇన్ చార్జి ని నియమించనున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఇన్ చార్జి పదవికి మాణిక్యం ఠాగూర్ రాజీనాామా చేశారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ చార్జిని పార్టీ అధిష్టానం నియమించనున్నది.

కుప్పంలో హైటెన్షన్ .. పోలీసులపై చంద్రబాబు ఫైర్.. ట్విస్ట్ ఏమిటంటే..?


Share

Related posts

Anchor Ravi : ‘అబ్బబ్బ ఆగలేను’.. సినిమా హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ రవి?

Varun G

Bigg boss 4: వావ్.. అఖిల్ ను అడ్డం పెట్టుకొని బిగ్ బాస్ భలే గేమ్ ఆడుతున్నాడే?

Varun G

బిగ్ బాస్ 4: అబద్ధాలు చెబుతూ అడ్డంగా కెమెరా ముందు బుక్కయిన అభిజిత్..!!

sekhar