NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మాణిక్యం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు థాకరే..రేవంత్ పదవి సేఫ్(యేనా?)

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల ఆగ్రహం, అసహనం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకూ టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను పార్టీ హై కమాండ్ గోవా ఇన్ చార్జిగా నియమించింది. మాణిక్యం ఠాగూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి మాణిక్ రావు థాకరే నియమితులైయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. మాణిక్ రావు థాకరే గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించిన నేతగా గుర్తింపు ఉంది.

Manikrao Thackeray Appointed As TPCC Incharge

ఇటీవల కాలంలో టీ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ కీలక నిర్ణయాలను తీసుకుంది. పలువురు సీనియర్ తెలంగాణ నేతలు మాణిక్యం ఠాగూర్ పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇన్ చార్జి పదవికి రాజీనామా చేసిన మాణిక్యం ఠాగూర్. టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు. గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యే ముందు .. ఈ రోజు వరకూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మెసేజ్ పెట్టారు మాణిక్యం ఠాగూర్.

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో టీ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ లో గందరగోళం నెలకొంది. టీ కాంగ్రెస్ ఇన్ చార్జి పదవి నుండి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారంటూ ప్రచారం జరగ్గా, అటువంటిది ఏమీ లేదు వాట్సాప్ గ్రూపులోనే ఉన్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు వాదించారు. ఆ ప్రచారాన్ని నమ్మలేదు. సాంకేతిక సమస్యల వల్లనే ఎగ్జిట్ అయ్యారంటూ మరి కొందరు పేర్కొన్నారు. చివరకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఈ పరిణామాల క్రమంలో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే తాను పదవి నుండి తప్పుకోవడానికైనా సిద్దమని పేర్కొన్నారు. పార్టీ కోసం ఏ త్యాగానికైనా సిద్దమని తెలిపారు. ఏ బాధ్యతలు ఇచ్చినా పార్టీ కోసం పని చేస్తానని అన్నారు రేవంత్ రెడ్డి.

Manikrao Thackeray Appointed As TPCC Incharge

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?