NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Medaram Jatara 2022: మేడారంలో పొటెత్తిన భక్తజనం

Medaram Jatara 2022:  దక్షిణాది కుంభమేళా మేడారం జాతరలో రెండవ రోజైన గురువారం మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 20 ఏళ్లలో తొలి సారిగా మాఘసుద్ధ పౌర్ణమి నాడు మహా జాతర ప్రారంభం కావడంతో భక్తులు జాతరకు పోటెత్తారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. జాతర తొలి రోజు బుధవారం పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా సారలమ్మ గద్దెలపై కొలువు తీరగా రెండవ రోజు గురువారం సమ్మక్క డప్పు వాయిద్యాలు, జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా చిలకలగుట్ట నుండి మేడారానికి వచ్చి గద్దెపై కొలువుదీరింది.

Medaram Jatara 2022 updates
Medaram Jatara 2022 updates

Medaram Jatara 2022: గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి

సమక్కకు స్వాగతం పలుకుతూ గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. సమ్మక్కకు వేల సంఖ్యలో భక్తులు స్వాగతం పలికారు. సమ్మక్క వచ్చే మార్గంలో భక్తులు పొర్లు పొర్లు దండాలు పెట్టారు. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు దర్శనాలను నిలుపుదల చేసి పూజారులు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. అనంతరం దర్శనాలు యధావిధిగా కొనసాగించారు.

Medaram Jatara 2022: కోలాహలంగా పరిసరాలు

రేపు ఎల్లుండి భక్తుల దర్శనార్ధం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా గుడారాలు వెలిశాయి. ఇసుకవేస్తే రాలనంత జనంతో పరిసరాలు కోలాహలంగా మారాయి. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో బందోబస్తు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం సిఎం కేసిఆర్ మేడారం జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోనున్నారు.

Read More: YS Jagan: సినీ నటుడు ఆలీకి నామినేటెడ్ పోస్టు ఖాయం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!ఇదిగో ప్రూఫ్..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju