అసొంలోని బీజేపీ సర్కార్ బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు రెండు వేల మందిని అరెస్టు చేసింది ప్రభుత్వం. 4,004 కేసులు చేసి, ఇప్పటి వరకూ 8వేల మందిని గుర్తించారు. ఈ అంశంలో డ్రైవ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అసొం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసొం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ .. బాల్య వివాహాలు చేసుకున్న వారిని అరెస్టు చేస్తే వారి బార్యలను ఎవరు చూస్తారని ప్రశ్నించారు.

ఎగువ అసొంలోని పేద ప్రజలకు భూములు ఇస్తున్న హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం.. దిగువ అసొంలోని ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎన్ని సూళ్లను ప్రారంబించారనీ, కొత్త స్కూళ్లను ఎందుకు ప్రారంభించడం లేదని ఒవైసీ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ముస్లింలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తొందని ఆయన ఆరోపించారు.
బాల్య వివాహాలు చేసుకున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంపై రాష్ట్రంలోని మహిళల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ కుమారులను, భర్తలను అరెస్టు చేస్తున్నందుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సంపాదించే వారు జైలులో ఉంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త