KTR: తారక రాముడికి చిర్రెత్తికొచ్చింది ..! ఇక ఊరుకునేది లేదు బరాబర్ సమాధానం చెబుతామంటూ హెచ్చరికలు..!!

Share

KTR: తారక రాముడికి ఏమిటి చిర్రెత్తుకొచ్చింది అనుకుంటున్నారా..?  అదే నండీ మన మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు  (కేటిఆర్) గారు ప్రతిపక్ష పార్టీ నేతల మీద గుస్సా అయ్యిండు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించి, రెండు సార్లు ప్రజా మద్దతుతో ముఖ్యమంత్రి అయిన వాళ్ల నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్)ను టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితరులు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తుంటే ఆయనకు గుస్సా అయ్యింది. ఏడేళ్ల నుండి ఓపిక పడుతున్నాం, ఇక సీఎంపై అవకాలు చవాకులు పేలితే ఊరుకుండేది లేదు బరాబర్ సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఇటీవల మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ ఠాకరేను విమర్శించిన ఓ కేంద్ర మంత్రినే పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. తెలుసుకుదా.  ఆ సంఘటనను ఉదహరిస్తూ ఇకపై ఎవడు పడితే వాడు ఇష్టానుసారంగా తమ నాయకుడు, సీఎం కేసిఆర్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకుండేది లేదని తేల్చి చెప్పేశారు.

minister KTR fires on opposition parties
minister KTR fires on opposition parties

జలవిహార్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ మహానగర సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా హజరైన కేటిఆర్ ఉగ్రరూపాన్ని చూపించారు. కొన్ని పేరుకే ఢిల్లీ పార్టీలు..వారు చేసేది మాత్రం చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం తమ పార్టీని అడ్డుకోవడం ఎవ్వరితరం కాదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లు చేయలేని పనులను ఏడేళ్లలో చేసి చూపించిన ఘనత పార్టీ అధినేత, సీఎం కేసిఆర్‌దేనని అన్నారు. హూజూరాబాద్ ఉప ఎన్నిక తమ పార్టీకి చాలా చిన్న అంశమని దీన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీ కాంగ్రెస్, టీ బీజేపీ నేతలను చూసినోళ్లు,  పట్టించుకున్నోళ్లు ఎవరూ లేరనీ, తెలంగాణ వచ్చిన తర్వాతే కేసిఆర్ పుణ్యమా అని కొందరికి పదవులు దక్కాయనీ, వాటిని చూసుకుని ఎగిరెగిరి పడుతున్నారని కేటిఆర్ విమర్శించారు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసిఆర్ మీ కంటే వయసులో 30 ఏళ్లు పెద్ద, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై చిల్లర మాటలు మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. ప్రజలకు అన్ని పార్టీల నాయకుల చరిత్రలు తెలుసుననీ, కేసిఆర్ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు కేటిఆర్.

Read More:

1.AP High Court: ఏపి సర్కార్ పై మరో సారి మండిపడిన హైకోర్టు..! ఎందుకంటే..?

2.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!

3.Minister Balineni: వైసీపీలో కాక.. పేషీలో పేచీ..! మంత్రిగారి ప్రైవేట్ రష్యా పర్యటన సీక్రెట్లు ఇవీ..!!


Share

Related posts

TRS : గండంగా గా మారిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు! గులాబీ పార్టీలో గుబులు!!

Yandamuri

Revanth Reddy : మోడీ, కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో సీరియస్ అయిన రేవంత్ రెడ్డి..!!

sekhar

Eatala Rajender: ఫైలెట్ అప్రమత్తతో ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం..!!

somaraju sharma