NewsOrbit
Entertainment News తెలంగాణ‌ సినిమా

బాహుబలికి ఆస్కార్ రావాల్సింది అంటూ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..!!

Share

2018లో వచ్చిన “బాహుబలి” రెండో భాగం భారతీయ చలనచిత్ర రంగంలో అన్ని రికార్డులు బ్రేక్ చేయడం తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” రావటం తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతే కదా అనేక అంతర్జాతీయ అవార్డులతో పాటు ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్ కూడా గెలవడం జరిగింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో “నాటు నాటు” పాటకు ఆస్కార్ రావటంతో… “RRR” సినిమా యూనిట్ ని దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసించారు.

Minister Thalasani's sensational comments that Baahubali should get an Oscar

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా యూనిట్ నీ ప్రత్యేకంగా సత్కరించబోతున్నట్లు ఆ టైంలో ప్రకటన చేయడం. కాగా ఆదివారం హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో “RRR” టీంకు అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ సహా టెక్నీషియన్ లందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బాహుబలికి ఆస్కార్ రావాల్సిందని.. ఇప్పుడు “నాటు నాటు” పాటకు ఆస్కార్ రావడం గర్వకారణం అని పేర్కొన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పలువురు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది.

Minister Thalasani's sensational comments that Baahubali should get an Oscar

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ సినిమా అవార్డు అందుకున్న చిత్రంగా “RRR” చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాట అంత హిట్ కావటానికి ప్రధాన కారణం.. చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సాంగ్ లో ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఇంకా సెలబ్రిటీలలో చాలా వేరే లెయ్యాయి. దేశంలో అనేక చోట్ల నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా చాలామంది సెలబ్రిటీలు చరణ్ తారక్ లతో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది. ఈ క్రమంలో “RRR”కి ఆస్కార్ రావటంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం సత్కరించడం విశేషం.


Share

Related posts

Boyfriend For Hire: బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్ టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్సేన్..!!

bharani jella

ఇక రకుల్ ని ఆపే సత్తా ఎవరికీ లేదు.. టైం అలా కలిసొస్తోంది..!

GRK

నిఖిల్ చిత్రం ఆగిపోయిందా?

Siva Prasad