MLA Jaggareddy: ఛాలెంజ్‌ లో గెలిచిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి..! ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై కీలక వ్యాఖ్యలు..!!

Share

MLA Jaggareddy: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరు టీఆర్ఎస్ కైవశం చేసుకుంది. అయితే మెదక్ జిల్లా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరాజయం పాలైనప్పటికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తన ఛాలెంజ్ ను నిలుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిల్చిన తన సతీమణి తూర్పు నిర్మల రెడ్డికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అయితే ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో నిర్మల రెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. జగ్గారెడ్డి ఛాలెంజ్ చేసిన దాని కంటే ఎనిమిది ఓట్లు ఎక్కువగా వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి యాదవరెడ్డికి 762 ఓట్లు వచ్చాయి.

MLA Jaggareddy comments on mlc elections

MLA Jaggareddy: వారు ఆవేశాన్ని ఎందుకు చంపుకున్నారో..?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఉత్సాహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించిన టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు.. ఎన్నికల్లో మళ్లీ టి ఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి వారి ఆవేశాన్ని ఎందుకు చంపుకున్నారో తెలియడం లేదని జగ్గారెడ్డి అన్నారు జగ్గా రెడ్డి. ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు, స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం లేదు, మీరు పోరాడాలి, కొట్లాడాలి, ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనీ టీ ఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే తన వద్ద చాలా సార్లు వాపోయారన్నారు. వారి హక్కుల కోసం ప్రత్యేకంగా ఫోరంగా కూడా ఏర్పడిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు.


Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

22 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

22 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

52 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago