తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తొందనీ, నూతన వాహనాన్ని సమకూర్చాలంటూ గత కొద్ది రోజులుగా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తులకు తెలంగాణ సర్కార్ స్పందించింది. ఆయన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని మార్చింది. ఈ మేరకు పోలీసులు శాఖ అధికారులు నూతనంగా కేటాయించిన తెలుపురంగు బుల్లెట్ ఫ్రూవ్ వాహనాన్ని ఆయన నివాసానికి తరలించారు. అయితే వాహనం మార్పు విషయంలో ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో రాజాసింగ్ ఇటీవల తనకు మొదట ఇచ్చిన పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలేసి వచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా చేసిన కొద్ది రోజులకే పోలీసులు మరో బుల్లెట్ వాహనం కేటాయించడం విశేషం.

ఈ సారి 2017 మోడల్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతలో భాగంగా సమకూర్చారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ కొత్త కారే తనకు కావాలని లేదనీ, మంచి కండిషన్ ఉన్న బుల్లెట్ ఫ్రూవ్ వాహనం ఇస్తే తనకు అదే చాలని స్పష్టం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడం సంతోషకరమని, ప్రస్తుతం కేటాయించిన వాహనం ఏ కండీషన్ లో ఉందో చూడాల్సి ఉందన్నారు. ఉగ్రవాదులు, విద్రోహ శక్తుల నుండి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో గతంలో ఆయనకు ప్రభుత్వం 2010 మోడల్ కు చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. అయితే ఆ వాహనం తరచూ మరమ్మత్తులకు గురి అవుతూ ఎక్కడపడితే అక్కడే వాహనం నిలిచిపోయేది. దీంతో విసుగు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా సార్లు వాహనాన్ని అక్కడే విడిచిపెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి, హోంశాఖ మంత్రికి, డీజీపీకి లేఖలు ద్వారా తెలిపారు. అయినా ప్రభుత్వం నుండి చాలా కాలం స్పందన రాలేదు. ఒక వేళ ఈ వాహనాన్ని తిరిగి పంపిస్తే మరలా అదే వాహనానికి మరమ్మత్తులు చేసి తనకు పంపిస్తున్నారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాత బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాననీ, తనకు హాని ఉందని, ఎక్కడపడితే అక్కడే ఆగిపోతుందని ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు రాజాసింగ్. ఎట్టకేలకు రాజాసింగ్ కు మరో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం సమకూరింది.
చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..రూ.3కోట్ల కారు వ్యవహారంలో నోటీసులు