TRS: ఖమ్మంలో కాకరేపిన క్రాస్ ఓటింగ్..! టీఆర్ఎస్ లో బహిర్గతమైన అసమ్మతి..!!

Share

TRS: తెలంగాణ స్థానిక సంస్థలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే, మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఆరు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. అయితే ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు విజయం సాధించినా ఆయనకు రావాల్సిన ఓట్లు రాలేదు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. టీఆర్ఎస్ నుండి గెలిచిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే ఆ పార్టీ అభ్యర్ధికి ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేశారు అంటే అక్కడి గ్రూపు రాజకీయాలు కారణమా, లేక అధికార టీఆర్ఎస్ పై అసంతృప్తితో క్రాస్ ఓటింగ్ చేశారా అనేది ఆ పార్టీ పోస్టుమార్టం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

MLC Elections Cross vote shocks in Khammam TRS

 

TRS: క్యాంపు రాజకీయాలు నిర్వహించినా…

నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే టిఆర్ఎస్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను క్యాంప్ కు తరలించారు. గోవా, బెంగళూరు ప్రాంతాలకు తరలించారు. పోలింగ్ రోజుకు వీళ్లను తీసుకువచ్చారు. అయినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగింది. మొత్తం 738 ఓట్లు ఉండగా టీఆర్ఎస్ కు 480, కాంగ్రెస్ పార్టీకి 242 ఓట్లు వచ్చాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో 96 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్ధికి 242 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 150 ఓట్లు అధికార పార్టీ నుండి కాంగ్రెస్ కు పోల్ అయ్యాయి. టిఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ అవ్వడంపై పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. క్రాస్ ఓటింగ్ పై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్సీగా గెలిచిన తాతా మధు అంటున్నారు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు లు గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వీరి వర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

11 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago