NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Komatireddy: అధికారులపై కోమటిరెడ్డికి కోపం వచ్చింది..! ఏకంగా లోక్‌సభ స్పీకర్‌కే ఫిర్యాదు చేశారు..! మేటర్ ఏమిటంటే..?

MP Komatireddy complaints speaker protocol violation issue

MP Komatireddy: నిబంధనల ప్రకారం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సమయంలో ఆ ప్రాంత గ్రామ సర్పంచ్ మొదలు కొని పార్లమెంట్ సభ్యుడి వరకూ ప్రజా ప్రతినిధులందరికీ అధికారులు ఆహ్వానం పంపాలి. ఇది ప్రోటోకాల్ ఆఫీసర్ విధి. అయితే కొందరు అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెబితే చాలనుకొని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు.

MP Komatireddy complaints speaker protocol violation issue
MP Komatireddy complaints speaker protocol violation issue

అయితే తమ నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోతే ఆయా ప్రాంత ప్రజా ప్రతినిధులు అవమానంగా భావిస్తుంటారు. కొందరు ప్రజా ప్రతినిధులు ఇటువంటి పరిణామాలను లైట్ గా తీసుకుని వదిలివేస్తుండగా కొందరైతే ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటారు. తాజాగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనపై భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు.

Read more: Twist In Marriage: పెళ్ళయిన రెండు నెలలకు అసలు విషయం తెలిసి వరుడు షాక్..! మేటర్ ఏమిటంటే..!?

భువనగిరి లోక్ సభ నియోజకవర్గం ఆలేరు అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలో సీఎం కేసిఆర్ నిన్న పర్యటించారు. పలు అబివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వాసాలమర్రిలో గ్రామస్తులతో కలిసి కేసిఆర్ సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం అందలేదుట. ఈ విషయాన్ని కోమటిరెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీలో ఉన్న కోమటిరెడ్డి నేరుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ఆహ్వానం పంపలేదనీ, ఇది ప్రజా ప్రతినిధులను అగౌరవపర్చడమేననీ, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More: Mansas Trust: మాన్సాస్ విషయంపై సీఎం వైఎస్ జగన్ కు ముద్రగడ లేఖ..! అయినా వదలని విజయసాయి..!!

కాగా త్వరలో తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో కోమటిరెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. టీ పీసీసీ పదవిని చాలా మంది సీనియర్ నేతలు ఆశిస్తున్నప్పటికీ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్యనే పోటీ నెలకొందన్న వార్తలు వస్తున్నాయి. పీసీసీ రేస్ లో ఉన్న సీనియర్ నాయకుడైన కోమటిరెడ్డి లాంటి ప్రజా ప్రతినిధికే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అదికారులు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?