NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Mla Sitakka: దిగువ స్థాయి అధికారికి ఉన్న మానవత్వం డీసీపీకి లేకపాయే..! ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ వీడియో వైరల్..!!

Mla Sitakka: కరోనా వేళ ములుగు ఎమ్మెల్యే అనసూయ అలియాస్ సీతక్క ఏజన్సీ ప్రాంతంలోని ఎంతో మంది పేదలకు సాయం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ పేదలను ఆదుకుంటున్నారు. అటువంటి ఆమెకు ఏదైనా కష్టం వస్తే మానవత్వంతో ఎవరైనా వ్యవహరించాలి. కానీ ఓ మహిళా పోలీస్ అధికారి వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే సీతమ్మ తీవ్ర ఆవేదన కల్గించింది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పోలీసు అధికారులు తమ విధినిర్వహణను సక్రమంగా నిర్వహించాలి. అందులో ఎటువంటి తప్పులేదు. కానీ లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రులకు వెళ్లే వారి పట్ల కనీస మానవత్వంతో పోలీసులు వ్యవహరించాల్సి ఉంది. ఓ ప్రజా ప్రతినిధిగా సీతక్క ఫోన్ చేసినా ఆ మహిళా పోలీస్ అధికారి స్పందించకపోవడం పట్ల తీవ్ర అవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోలీస్ అధికారిణి తీరును నెటిజన్ లు తప్పుబడుతున్నారు.

mulugu mla Sitakka serious comments on dcp video viral
mulugu mla Sitakka serious comments on dcp video viral

విషయం ఏమిటంటే..ఎమ్మెల్యే సీతక్క తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఐసీయూలో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. సీతక్క తల్లికి బ్లడ్ అవసరం కావడంతో సీతక్క బంధువులు ములుగు నుండి రక్తదానం చేయడానికి బయలుదేరారు. వీరు హైదరాబాద్ వచ్చేందుకు అక్కడి జిల్లా కలెక్టర్ ద్వారా వెహికల్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. వీరు రక్తదానం చేయడానికి హైదరాబాద్ వస్తుండగా హైదరాబాద్ లో మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత అడ్డుకుని వాహనాన్ని నిలుపుదల చేశారు. ఎమ్మెల్యే సీతక్క తల్లికి రక్తదానం చేసేందుకు ఆసుపత్రికి వెళుతున్నామని, అవసరమైతే తమ బంధువైన ఎమ్మెల్యే సీతక్కతో మాట్లాడండి అంటూ వారు చెప్పినా డీసీపీ పట్టించుకోలేదు. దాదాపు అరగంట సేపు వాహనాలను అక్కడే నిలుపుదల చేశారు.

Read More: Corona Vaccine: ఏపీ టీకాల్లో తిక్క తిక్క పనులు..! ఇదేమి లెక్క బాసూ..!?

డీసీపీ వెళ్లిపోయిన తరువాత అక్కడ ఉన్న దిగువ స్థాయి అధికారిణి ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి వారు చెప్పింది వాస్తవమేనని తెలుసుకుని వారి వాహనాన్ని విడుదల చేశారు.  ఈ విషయాన్ని సీతక్క వీడియోలో వెల్లడిస్తూ విధి నిర్వహణలోనూ పోలీసు అధికారులు మానవత్వం చూపాలన్నారు. ప్రజల బాధలను అర్థం చేసుకోవాలన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయిన తనకే ఈ పరిస్థితి ఎదురైందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju