తెలంగాణ‌ న్యూస్

భారీ భద్రత నడుమ మునావర్ ఫారూఖీ కామిటీ షో విజయవంతం

Share

హైదరాబాద్ శిల్ప కళావేదిక వేదిక వేదికగా సాగిన స్టాండప్ కామెడీ స్టార్ మునావర్ షో భారీ పోలీస్ భద్రత నడుమ విజయవంతంగా ముగిసింది. తన షోలలో హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ మునావర్ పై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ లో షో నిర్వహణపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజాసింగ్ ను పోలీస్ లు హౌస్ అరెస్టు చేయడంతో పాటు శిల్ప కళా వేదిక పరిసరాల్లో వేలాది మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

 

మరో పక్క షో సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రేక్షకులు తమ వెంట సెల్ పోన్ లు , వాటర్ బాటిళ్ల ను గానీ పోలీసులు అనుమతించలేదు. షో ను అడ్డుకునేందుకు పలువురు బీజేపీ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో షో ప్రశాంతంగా ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు షో కొనసాగింది. మునావర్ షోకు కర్ణాటకలో మునావర్ షోకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చివరి నిమిషంలో అనుమతి ఇచ్చింది. ఒక్క రోజు ముందు అనుమతి మంజూరు చేసినప్పటికీ షో కు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కామెడీ షోను ఆస్వాదించారు.


Share

Related posts

Tarun : తరుణ్ మళ్ళీ హీరోగానా.. నిజమేనా..?

GRK

క‌రోనా క‌ల‌క‌లం… కేసీఆర్ మ‌నుషుల్లో ఓ ఎంపీ, ఇంకో ఎమ్మెల్యే

sridhar

Intelligent People మేధావులకు ఉండే లక్షణాలు ఇవే!!మరి ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో తెలుసుకోండి!!( పార్ట్-2)

Kumar