NewsOrbit
Featured తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP : పట్టు విడవొద్దు… రాజకీయ కాక తగ్గొద్దు! నాగార్జున సాగర్ ఎన్నికపై బీజేపీ మంత్రం!

BJP : యుద్ధన్ని మధ్యలో వదిలేస్తే అది మొదటికే మోసం తెస్తుంది. జాతర మొదలు పెట్టాక వేడి తగ్గితే పండగ వాతావరణం పోతుంది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి, దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ  మంచి ఫలితాలు రాబట్టుకున్న బిజెపి ఇదే స్పీడు కొనసాగించడానికి, తెలంగాణలో రాజకీయ వేడి రాజయ్య డానికి ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఫలితంగా తెలంగాణాలో బీజేపీ ఒకపక్క వ్యూహంతో రాజకీయాలు చేస్తోందని తెలుస్తోంది.

BJP
BJP

BJP : ఎవరిని ఎంపిక చేద్దాం!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని అవసరం బీజేపీకి ఉంది. తెలంగాణలో గట్టిపట్టు పెంచుకోవాలంటే ఈ ఉప ఎన్నికల్లో విజయం తప్పనిసరి. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

** మొదట జానారెడ్డి బిజెపి లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య మీద కాంగ్రెస్ తరపున జానారెడ్డి పోటీ చేశారు. 7,700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయితే తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పని చేయలేదు. కాంగ్రెస్ మీద ఆయన కోపంతో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో జానారెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకుంటారని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆయనే ఉంటారని ప్రచారం ఎక్కువ కావడంతో జానారెడ్డి స్వయంగా స్పందించి తాను ఎప్పటికీ కాంగ్రెస్ను వీడను అంటూ స్పష్టం చేశారు. దాని తర్వాత ఆయన కొడుకును బీజేపీ అభ్యర్థిగా నిలబెడుతుంది అన్న ప్రచారం కూడా జరిగింది. దీనిని సైతం జాన కుటుంబం ఖండించడం తో పాటు తాము ఎప్పటికీ కాంగ్రెస్ వాదులమే అని అర్థం చేయడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

** ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వచ్చిన ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి తన అభ్యర్థిగా ప్రకటిస్తే ఉందన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే విజయశాంతి సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న బీజేపీ, ఆమెను అభ్యర్థిగా నిలిపేందుకు చివరి నిమిషంలో విముఖత వ్యక్తం చేసింది.

BJP
BJP

తాజాగా కోమటిరెడ్డి!

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలబడతారని తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న కోమటిరెడ్డి ఆ పార్టీ తీరు మీద వైఖరి మీద బహిరంగంగా విమర్శలు చేశారు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు. అందులోనూ అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారని అక్కసుతో పాటు పార్టీ అధిష్టానం తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న అతను ఆయన బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను త్వరలోనే పార్టీ మార్పు మీద ఆలోచిస్తున్నట్లు చెప్పడం, ఖచ్చితంగా బిజెపిలోకి వెళ్తారని ప్రచారం ఊపందుకోవడం జరిగింది. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థి అవుతారు అన్నది సాగుతున్న చర్చ.

మళ్ళీ ఉప ఎన్నిక రావడమే లక్ష్యం

తెలంగాణలో రాజకీయ వేడి తగ్గకుండా ఎప్పటికప్పుడు ఉపఎన్నికలు రావడమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే గా ప్రస్తుతం ఉన్న రాజగోపాల్ రెడ్డి ని నాగార్జునసాగర్ ఓపెన్ ఎన్నికల్లో నిలబెట్టి, గెలిపించుకోవడం ద్వారా మునుగోడు స్థానం ఖాళీ అవుతుంది. అంటే అక్కడ మళ్లీ ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. దీనివల్ల తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి పుడుతుంది. ఇలా తెలంగాణాలో ఎప్పటికప్పుడు ఎన్నికల రావడం, రాజకీయ చర్చ ఊపు అందుకోవడం వల్ల బీజేపీ ను, పార్టీ బలాన్ని సైతం ప్రజలు గుర్తు పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది అన్నది నాయకుల అంచనా. దీని కారణంగానే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో దించాలని కాషాయం పార్టీ భావిస్తోంది. మరి బీజేపీ వ్యూహం ఎంత మేరకు ఫలిస్తుందో? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లోకి రావడానికి సిద్ధంగానే ఉన్నారా? ఒకవేళ ఉన్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా? మళ్లీ తెలంగాణలో ఉప ఎన్నికలు కచ్చితంగా రానున్నాయా అనే ప్రశ్నలు కాలానికే వదిలేయాలి.

 

 

author avatar
Comrade CHE

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!