Revanth Reddy: ఎన్టీవీ కీ రేవంత్ కీ ఎందుకంత ప్రేమ..!?

Share

Revanth Reddy: తెలంగాణలో గానీ ఏపీలో గానీ ప్రతి పార్టీకి కొన్ని న్యూస్ ఛానల్స్ కొమ్ముకాస్తున్నాయి. ప్రతి నాయకుడికి కొన్ని ఛానళ్లు, కొందరు జర్నలిస్ట్ లు భజన చేస్తున్నారు. ఇది తెలుగు రాజకీయాల్లో, తెలుగు మీడియాలో, తెలుగు కుల వ్యవహారాల్లో ఇవి సహజం అయిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో గులాబీ ఛానళ్లు అనేకం ఉన్నాయి. సీఎం కేసిఆర్ తుమ్మినా దగ్గినా భజన చేయడానికి నాలుగైదు ఛానళ్లు టీ న్యూస్, నమస్తే తెలంగాణ సహా టీవీ 9 లాంటి నాలుగైదు ఛానళ్లు సిద్దంగా ఉన్నాయి. బీజేపీ నాయకులు తుమ్మినా దగ్గినా కవర్ చేయడానికి సిద్దంగా కొన్ని ఛానళ్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే మీడియాలో కవరేజ్ తక్కువ అయినట్లుగా ఆయన అభిమానులు నొచ్చుకునే వాళ్లు. కాకపోతే ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ రేవంత్ రెడ్డి పై ప్రేమ పెంచుకున్నట్లుగా కనబడుతోంది. తెలుగు న్యూస్ ఛానల్ లో ఎన్టీవీ అగ్రస్థానానికి పోటీ పడుతోంది. తెలుగు రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. పార్టీ పట్ల ప్రేమ పుట్టిందో లేక రేవంత్ రెడ్డి పట్ల ప్రేమ పుట్టిందో కానీ ఎన్టీవీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఓ అజెండా ప్రకారం పని చేస్తున్నట్లుగా కనబడుతోంది.

NTV Channel Highlight Revanth Reddy programs

Revanth Reddy: పార్లమెంట్ సీటు కోసమేనా…?

రాబోయే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ నుండి ఎన్టీవీ అధినేత చౌదరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారని మరో పక్క ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో రాజ్యసభ సీటు వస్తుందని భావించి భంగపడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారనీ, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే రేవంత్ రెడ్డి సపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే పొంగులేటి కంటే ముందుగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధిత్వం ఖరారు చేసుకునేందుకు గానూ ఎన్టీవీ చౌదరి .. రేవంత్ రెడ్డి మంచి చేసుకునేందుకు తన ఛానల్ ద్వారా భారీగా కవరేజ్ ఇస్తున్నారనే టాక్ నడుస్తొంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీవీ చౌదరి ఆశ నెరవేరుతుందో లేదో తేలాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

పార్టీ పెద్దలతో సంబంధాలు ఉన్నా..

ఎన్టీవీ చౌదరికి పార్టీ అధిష్టానం పెద్దలతో సత్సంభందాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహకారం లేకపోతే టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న రాజకీయ వ్యూహంతోనే రేవంత్ రెడ్ కార్పెట్ కవరేజ్ ఇస్తున్నారని అంటున్నారు. ఎంపి కావాలన్న ఆశతోనే చౌదరి ఈ ఫందా ఎంచుకున్నారని ఎన్టీవీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

53 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago