PM Modi: తెలంగాణలో మార్పు తధ్యమని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి బీజేపీ కార్యకర్తలు, ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టులోనే బీజేపీ కార్యకర్తలు, నేతలతో మోడీ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వాగతం అంటూ తెలుగు లో మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసిఆర్ పై చురకలు వేస్తూ విమర్శలు చేశారు. పట్టుదలకు, పౌరషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని చెప్పుకొచ్చిన మోడీ.. తెలంగాణకు ఎప్పుడు వచ్చినా ఇక్కడి ప్రజలు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, అప్యాయాతలకు రుణ పడి ఉంటానని అన్నారు. బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ సర్దార్ పటేల్ ఆశయాల కోసం పోరాడుతారన్నారు. భారతదేశానికి సేవ చేసేందుకు మనమంతా పని చేస్తామన్నారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేశామన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడుల విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రాణ త్యాగం చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు.
తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పారోడాలని మోడీ పిలుపు నిచ్చారు. తెలంగాణ పోరాటంలో వేలాది మంది త్యాగం చేశారనీ తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలు చేశారనీ, ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని మోడీ అన్నారు. తెలంగాణను విఛ్చిన్నం చేసే వారు అప్పుడు ఇప్పుడు ఉన్నారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని బందింధాలని కొందరు చూస్తున్నారని మోడీ విమర్శించారు కుటుంబ పాలన చేసే వాళ్లు దేశ ద్రోహులుగా అభివర్ణించారు మోడీ. తెలంగాణలో అధిాకారంలోకి వచ్చేది బీజేపియే నని, పక్కాగా రాష్ట్రంలో మార్పు వస్తుందని అన్నారు. పేదల సమస్యలు కుటుంబ పార్టీలకు పట్టవని పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మోడీ. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారనీ, అయినా ప్రజల మనసులో బీజేపీని తీసి వేయలేరని మోడీ అన్నారు.
ఇదే క్రమంలో కేసిఆర్ పై చురకలు వేశారు మోడీ. తెలంగాణ పాలకులకు అంథవిశ్వాసాలు పెరిగిపోయాయంటూ పరోక్షంగా కేసిఆర్ కు సెటైర్ వేశారు. కొన్ని ప్రాంతాలకు వెళితే అరిష్టమని భావించే ధోరణి ని ప్రధాని మోడీ తప్పుబట్టారు. సెక్రటేరియట్ తో సహా కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే మూఢనమ్మకాల కారణంగా భయపడుతున్నారని కేసిఆర్ ను ఉద్దేశించి మోడీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి వాటి గురించి తన దృష్టికి తీసుకువస్తే వాటిని పట్టించుకోలేదన్నారు. యూపి సీఎం యోగి అదిత్యనాథ్ కూడా నోయిడా వెళ్లి మూఢనమ్మకాలకు చెక్ పెట్టడమే కాక తిరిగి ముఖ్యమంత్రిగా గెలిచారని అన్నారు. 21వ శతాబ్దంలో కూడా అంథ విశ్వాసాలను నమ్మే పాలకుల కారణంగాై తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని మోడీ పేర్కొన్నారు. అనంతరం మోడీ ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లోై పాల్గొన్నారు.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…