NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీ నోట.. జగన్ మాట

Share

జగన్ మాట ఏమిటి మోడీ నోట అని అనుకుంటున్నారా..? అవును మీరు చదువుతున్నది కరెక్టే. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చాలా కాలంగా తను ఒక్కడినే.. తనపై పోరాటానికి దుష్టచతుష్టయం, చంద్రబాబు, దత్త పుత్రుడు, వారి అనుకూల మీడియా, తోడేళ్లు అన్నీ ఏకమవుతున్నాయి అంటూ విమర్శలు చేయడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ కూడా అదే తీరుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేయడం చూస్తుంటే జగన్ మాట మోడీ నోట అనవచ్చేమో కదా.. ! ప్రధాన నరేంద్ర మోడీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా నేడు సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం పెరెడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో కేసిఆర్ సర్కార్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

PM Modi speech in Hyderabad

తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయని అన్నారు మోడీ. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో అధికారపక్షాలు బలంగా ఉన్నాయి. అటు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను దెబ్బతీయడం ఒక్క కాంగ్రెస్ వల్ల అయ్యే పరిస్థితి లేదు. అందుకే బీజేపీయేతర పక్షాలు ఏకం అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని నరేంద్ర మోడీ ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన విమర్శలు ఏపిలో జగన్మోహనరెడ్డి ఎప్పటి నుండో చేస్తున్నారు. ఇంకా ప్రధాని మోడీ ఏమన్నారంటే .. కేంద్రంతో రాష్ట్రం కలిసి రావడం లేదనీ, అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోందని అన్నారు. కొందరు అభివృద్ధికి అడ్డం తలుగుతున్నారని పరోక్షంగా సీఎం కేసిఆర్ ను ఉద్దేశించి విమర్శించారు. కొందరి గుప్పిట్లోనే తెలంగాణ మగ్గుతుందని అన్నారు. కుటుంబ పాలనతోనే అవినీతి పెరుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.

రైతులు, విద్యార్ధులు, చిన్న వ్యాపారులకు నేరుగా వారి ఖాతాల్లోనే తాము డబ్బు జమ చేస్తున్నామనీ, డిజిటల్ పేమెంట్ వ్యవస్థను దేశంలో పెంచడం ద్వారా అవినీతిని తగ్గించేందుకు పాటుపడుతున్నామని తెలిపారు. నిజాయితీ గా పని చేస్తే వారికి తాము గిట్టడం లేదని అన్నారు. వారు సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారని అన్నారు. ఎవరు ప్రశ్నించినా వారిని శత్రువులుగా చూస్తున్నారన్నారంటూ పరోక్షంగా కేసిఆర్ పై విమర్శలతో దుయ్యబట్టారు మోడీ. కుటుంబ పాలన చేసే వారికి సమాజం అభివృద్ధి పట్టదని మోడీ అన్నారు. అవినీతిపరులపై చర్యలు చేపట్టాలా వద్దా అని ప్రశ్నించారు. గడచిన 9 సంవత్సరాల్లో 11 కోట్ల మంది మహిళలకు లబ్ది కలిగిందని చెప్పారు. అవినీతిపరులపై పోరాటానికి ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. ప్రజల అకాంక్షను నెరవేర్చడమే తమ లక్ష్యమని అన్నారు. అవినీతి పరులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?


Share

Related posts

Modi: మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంతో మ‌న‌కు ఏం లాభ‌మంటే…

sridhar

Couples: లాక్ డౌన్ లో భార్య భర్తలు గూగుల్ లో దేనికోసం వెతికారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ??

siddhu

హాయ్ హాయ్ “సిగ్నల్” .. బై..బై.. వాట్సాప్..

bharani jella