NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ముగిసిన పీఎం మోడీ తెలంగాణ ఎలక్షన్ ప్రచారం.. హైలెట్ ఏమిటంటే..?

PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. వరుసగా  మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించిన ప్రధాని మోడీ నిన్న సాయంత్రం తిరుమల వెళ్లారు. ఇవేళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మరల హైదరాబాద్ చేరుకున్న మోడీ.. ఈరోజు మహబూబ్ నగర్, కరీంనగర్ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ వరకూ 2.5కిలో మీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో ప్రధాని మోడీ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదనం చేస్తూ ముందుకు సాగారు.

ప్రధాని మోడీ పై అభిమానులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. మోడీ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు. కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న ప్రధాని మోడీ..వీర సావర్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపు భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షో అనంతరం ప్రధాని మోడీ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా హజరై స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మోడీ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.

కాగా, ఈ సారి మోడీ ఎన్నికల ప్రచారంలో హైలెట్ ఏమిటంటే.. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని, ప్రజలు బీజేపీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగులో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా..? ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా..? సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి మనకు అవసరమా..? అంటూ తెలుగులో ప్రశ్నలను సంధించి ప్రజలను ఆకట్టుకున్నారు. కేసిఆర్ కు అంధ విశ్వాసాలు ఎక్కువని విమర్శించిన మోడీ.. మూడ విశ్వాసాలతో ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. అంధ విశ్వాసాలతోనే సచివాలయం కూల్చారని అన్నారు.

బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయని విమర్శించారు. గతంలో కేసిఆర్ ఢిల్లీకి వచ్చి బీజేపీతో కలుస్తామని అడిగారని, తన వారసుడిని సీఎంగా చేస్తే బీజేపీతో కలుస్తామన్నారని చెప్ర్పారు.  కేసిఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బీజేపీని తిట్టడం మొదలు పెట్టారని అన్నారు మోడీ. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసిఆర్ కు ప్రజలు ట్రైలర్ చూపించారనీ, ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సినిమా చూపిస్తారని అన్నారు. దేశానికి మార్గనిర్దేశం చేసిన పీవీని ప్రధానిగా తెలంగాణ అందించిందనీ, ఆయన్ను కాంగ్రెస్ ఎంతగానో అవమానించిందన్నారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతుందని అన్నారు. కేసిఆర్ సర్కార్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు.

Telangana Election 2023: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ @రైతుబంధు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju