హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పరిధిలో పలు ఫామ్ హౌస్ లలో అసాంఘీక కార్యకలాపాలు యదేశ్చగా జరుగుతున్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకకాలంల 32 ఫామ్ హౌస్ లపై పోలీసులు ఏకకాలంగా ఆకస్మిక సోదాలు చేపట్టారు. నాలుగు ఫామ్ హౌస్ లలో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో 23 మందిని పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద రూ.1.03లక్షల నగదు, ప్లేయింగ్ కార్డ్స్, ఏడు సెల్ ఫోన్లు, భారీగా మద్యం సీసాలు, హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

మోయినాబాద్ లోని బిగ్ బాస్ ఫామ్ హౌస్, జహీంగీర్ డ్రీమ్ వ్యాలీలో నిందితులను అరెస్టు చేశారు. అలాగే శంషాబాద్ లోని రిప్లేజ్ ఫామ్ హౌస్, మేడ్చల్ లోని గోవర్థన్ రెడ్డి ఫామ్ హౌస్ ల్లో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇంకా ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదానీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ .. కమిటీ ఏర్పాటుపై నిర్ణయాన్ని వ్యక్తం చేసిన కేంద్రం