Police thief: దొంగతనాలు, ఇతర నేరాలు చేసిన వారిని పట్టుకుని జైలుకు పంపించాల్సిన ఓ పోలీస్ అధికారి బుద్ది వక్రమార్గం పట్టింది. తన చేతివాటాన్ని ప్రదర్శించి చోరీ కేసులో అరెస్టు అయిన నిందితుడి బ్యాంక్ అకౌంట్ నుండి రూ.5లక్షలు కాజేశాడు. ఈ ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర సంచలనం కల్గించింది. ఈ అధికారి నిర్వాకం పోలీస్ శాఖ ప్రతిష్టకు మాయని మచ్చ అయ్యింది.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Police thief: నిందితుడి బ్యాంక్ డెబిట్ కార్డు నుండి..
వివరాల్లోకి వెళితే.. టైర్ల దొంగతనం కేసులో అగర్వాల్ అనే నిందితుడిని ఈ ఏడాది ఫిబ్రవరిలో సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ సమయంలో పోలీసులు అగర్వాల్ డెబిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అగర్వాల్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ సమయంలో పోలీసుల వద్ద నుండి తన బ్యాంక్ డెబిట్ కార్డు తీసుకున్నారు. అయితే తను రిమాండ్ లో ఉన్న సమయంలో డెబిట్ కార్డు నుండి భారీగా నగదు (రూ.5లక్షలు) విత్డ్రా చేసినట్లు గుర్తించిన అగర్వాల్ వెంటనే లావాదేవీలు తెలుసుకునేందుకు బ్యాంకును సంప్రదించాడు.
Police thief: అతర్గత విచారణలో వెలుగులోకి
తన డెబిట్ కార్డు పోలీసుల అధీనంలో ఉన్న సమయంలో బ్యాంక్ ఖాతా నుండి రూ.5లక్షలు విత్డ్రా జరిగిన విషయంపై బాధితుడు అగర్వాల్ రాచకొండ పీఎస్ కు చెందిన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అతర్గత విచారణకు ఆదేశించారు. పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడి బ్యాంకు ఖాతా నుండి ఓ ఇన్స్ పెక్టర్ నగదు విత్ డ్రా చేసినట్లు తేలిసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయం బయటకు తెలియడంతో దొంగలకే దొంగ ఈ పోలీస్ అధికారి అంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.