NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS: రంగం లోకి దిగడం దిగడమే .. రాజకీయ బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్ !

TRS: గత కొద్ది కాలంగా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలోపేతం అవుతుండటంతో అధికార టీఅర్ఎస్ కొంత మేర ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వార్తలు వచ్చాయి. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఉప ఎన్నికలు జరిగితే అక్కడి ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంటాయి. కానీ తెలంగాణలో దుబ్బాక, హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. అక్కడి బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఒక్క సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల నుండి 45కిపైగా స్థానాలకు ఎగబాకింది. అధికార టీఆర్ఎస్ పై ఓ పక్క బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మరో పక్క పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముప్పెట దాడి చేస్తున్నారు. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని సుస్థిరపర్చుకోవాలంటే రాజకీయ వ్యూహకర్త అవసరమని టీఆర్ఎస్ భావించింది.

Political Strategist PK enter in TRS
Political Strategist PK enter in TRS

TRS: ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన రెండు రోజుల్లోనే..

వాస్తవానికి సీఎం కేసిఆర్ యే మాటల మాంత్రికుడుగా పేరుంది. మాటలతోనే ప్రజలను మెస్మరైజ్ చేయగలరు. సెంటిమెంట్ ను రగిల్చి దాన్ని ఓట్ల రూపంలో మర్చుకోగల కేపాసిటీ ఆయనకు ఉంది అంటారు. అయితే ఈ సారి బీజేపీ వ్యతిరేక కూటమి కట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రంతిప్పాలని కేసిఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగా అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీకి చెక్ పెట్టడానికి ఉద్దండ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) నియమించుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రశాంత్ కిషోర్ రాష్ట్రానికి చేరుకుని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగిన రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు వెలుగులోకి రావడం, ఆ కేసులో కొందరిని అరెస్టు చేయడం చకచెకా జరిగిపోయాయి. ఈ కేసులో బీజేపీ మాజీ ఎంపి జీతేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకె అరుణలపైనా అనుమానాలు ఉన్నాయనీ, వారి ప్రమేయంపైనా విచారణ జరుపుతామని సైబరాబాద్ సీపీ పేర్కొనడం తెలిసిందే.

TRS: ఉత్తరాదిలో చెల్లుతాయేమో కానీ తెలంగాణలో..

అయితే ఈ ఆరోపణలను డీకే అరుణ కొట్టిపారేస్తున్నారు. ఇదంతా పీకే పొలిటికల్ స్ట్రాటజీగా ఆమె ఆరోపిస్తున్నారు. పీకే ఎక్కడ వ్యూహకర్తగా పని చేసినా అక్కడ సెంటిమెంట్ డ్రామా వర్క్ అవుట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారనీ, ఇదీ అందులో భాగమేనని అంటున్నారు. ఇలాంటి వ్యూహాలు ఎక్కడో ఉత్తరాదిలో చెల్లుతాయేమో కానీ తెలంగాణలో చెల్లవని డీకే అరుణ అంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ తో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. దీని వెనుక పీకే స్ట్రాటజీ ఉందో లేదో తెలియదు కానీ బీజేపీ నేతలు మాత్రం ఆ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. సో.. ప్రస్తుతం తెలంగాణలో పరిణామాలు గమనిస్తే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతోందని అంటున్నారు. ఆయన టీమ్ ఇప్పటికే టీఆర్ఎస్ కోసం తమ వర్క్ ప్రారంభించిందని అంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju