ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరికకు దాదాపు మూహూర్తంగా ఖరారు అయినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. బలమైన నేతలుగా ఉన్న వీరిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ టీపీలు కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే ఖమ్మం జిల్లాలో పొంగులేటి తన వర్గీయులు తొమ్మిది మందికి ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులుగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు పొంగులేటితో చర్చలు జరిపారనీ, అయితే ఆయన అడిగిన తొమ్మిది స్థానాలు కేటాయించే విషయంలో స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తొంది. ఈ కారణంగా కాంగ్రెస్ లో చేరిక విషయంపై వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తొంది.

ఇక రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటున్న బీజేపీ మాత్రం ఎలాగైనా పొంగులేటి, జూపల్లి లను పార్టీలో చేర్చుకుని రెండు జిల్లాల్లో బలోపేతం కావాలని భావిస్తుంది. ఆ క్రమంలో పొంగులేటి, జూపల్లి ప్రతిపాదించిన నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికలో వారికే ఫ్రీహాండ్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ చేరికల కమిటీ నేతలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందనరావు తదితర బీజేపీ నేతలు తదితరులు ఇవేళ ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి నివాసంలో లంచ్ మీటింగ్ కు ఈ నేతలు హజరు అవుతున్నారు.
ఇప్పటికే పలు మార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిసి చర్చించినందున ఇవేళ మీటింగ్ లో పార్టీలో చేరిక అంశంపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొంగులేటి బీజేపీలే చేరిడం దాదాపు ఖాయమని అనుచరులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరతారని అంటున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల అనంతరం ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి బీజేపీలో చేరతారని తెలుస్తొంది.
చంద్రబాబు అరెస్టు ఖాయమే(నట)..!