25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ సీఎం కేసిఆర్ తో పంజాబ్ సీఎం భవతంత్ మాన్ సింగ్ భేటీ

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన పంజాబ్ సీఎం భగవత్ సింగ్ ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం కేసిఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతి భవన్ లోకి సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసిఆర్ ఆయనతో కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో అమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి సీఎంగా భగవత్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా హైదరాబాద్ కు వచ్చారు. ఇది మర్యాదపూర్వకంగానే కలిసిన సమావేశం మాత్రమేనని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Punjab cm met with Telangana cm kcr

 

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జాతీయ రాజకీయాలపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తొంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, కేసిఆర్ ఆలోచనలను భగవత్ సింగ్ మాన్ అడిగి తెలుసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలపైనా వీరు చర్చించినట్లుగా తెలుస్తొంది. రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్, బీజేపీ లను ఓడించడంపై వారు చర్చించినట్లు చెబుతున్నారు. .తొలుత పంజాబ్ సిఎం భగవత్ సింగ్ హైదరాబాద్ లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్నారు.

Punjab cm met with Telangana cm kcr

ఉదయం కిడ్నాప్ ..మధ్యాహ్నం పెళ్లి .. తండ్రికి షాక్ ఇచ్చిన కుమార్తె

సీఎం కేసిఆర్ బీఆర్ఎస్ అధినేతగా జనవరి నుండి దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి సారించనున్నారని సమాచారం. ముందుగా ఆరు రాష్ట్రాల్లో కిసాన్ కమిటీలు ఏర్పాటునకు కేసిఆర్ సిద్దం అవుతున్నారు.ఈ క్రమంలోనే జనవరిలో ఢిల్లీలో మేధావులు, వివిధ రాజకీయ పక్షాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు.

చిత్తశుద్దితో బయటకు వస్తా కరీంనగర్ చౌరస్తాలో చెప్పులు దెబ్బలు తినడానికి సిద్దమా అంటూ మంత్రి కేటిఆర్ సవాల్


Share

Related posts

అందుకే రాజధాని మార్చేస్తున్నారు… అసలు స్టోరీ చెప్పిన…!!

sekhar

అదే జరిగితే చంద్రబాబు పరువు అంతా గోవిందా…! తిరుపతిలో తలెత్తుకోలేరేమో…?

siddhu

కర్నూలులో రాపిడ్ టెస్టుల్లో భారీగా బయటపడుతున్న కరోనా కేసులు

Siva Prasad