Ramappa Temple: బిగ్ బ్రేకింగ్ ..చారిత్రక రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు..! ఫలించిన తెలంగాణ ప్రభుత్వ కృషి..!!

Share

Ramappa Temple: కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం కేసిఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కాకతీయుల కాలం నాటి నాగరికతా వైభవానికి ప్రతీక ఈనాటికీ ఠీవిగా నిలుస్తున్న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేసింది. కేంద్రానికి పదే పదే లేఖలు రాసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రయత్నాలు మరింతగా పెరిగాయి. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎంపిలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తులు చేశారు.

Ramappa Temple has been inscribed as a UNESCO World Heritage Site
Ramappa Temple has been inscribed as a UNESCO World Heritage Site

రామప్ప ఆలయాన్ని యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ (ఇకోమాస్) ప్రతినిధి వాసుపోశానందన్ 2019 సెప్టెంబర్ 25న సందర్శించారు. దేవాలయాన్ని అణువణువు పరిశీలించారు. ఆ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ప్రపంచ వారసత్వ కట్టడాల ప్రతిపాదనల ఆమోదంపై గత ఏడాది ఫిబ్రవరిలో 21 దేశాల ప్రతినిధుల సమావేశం చైనాలో జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. నాడు వాయిదా పడిన కాన్ఫరెన్స్ ఈ నెల 16 నుండి ప్రారంభం అయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకూ కాన్పరెన్స్ జరగుతుండగా ఆదివారం జరిగిన సదస్సులో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు ఇస్తూ కాన్షరెన్స్ నిర్ణయం తీసుకున్నది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హర్షం వ్యక్తం చేస్తుంది.


Share

Related posts

కేటీఆర్ ప‌రువు గోవిందా… ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదేమో!

sridhar

నరనరానా నారప్ప నామమే..! కళ్ళలో చురకత్తి.., చేతిలో కత్తితో వెంకీ లుక్..!

bharani jella

మొన్న గుంటూరు.. నేడు విజయనగరం.. విద్యార్థులకు కరోనా..!!

Special Bureau