NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth reddy: సెంటిమెంట్‌తో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

Revanth reddy: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను టార్గెట్ చేయ‌డంలో అవ‌కాశం కోసం ఎదురుచూసే టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోమారు అదే రీతిలో దూకుడుగా స్పందించారు. భారీ వ‌ర్షాల‌తో జ‌రిగిన పంట న‌ష్టంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సున్నిత‌మైన అంశాల‌తో ఆయ‌న సీఎంను టార్గెట్ చేశారు. వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న‌ భారీ వర్షాలు, వరదలతో తీవ్ర పంట నష్టం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. రైతుల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తోందని వివ‌రించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో పంట నష్టం తీవ్రంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. పంట నీట మునిగి, పెట్టిన పెట్టుబడి సర్వం కోల్పోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Read More: KCR: మోడీ కంటే కేసీఆర్ తోపు అంటున్న కోదండ‌రాం

Revanth Reddy hot comments on party turned Mla's

రేవంత్ ఏమంటున్నారంటే..

విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట న‌ష్టం అంచ‌నా వేయించే వారని పేర్కొన్న రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవని ఆరోపించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారని మండిప‌డ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళం పాడారని మండిప‌డ్డారు. జాతీయ వ్యవసాయ బీమా సంస్థ రాష్ట్రంలో వర్ష బీమా – 2021 పేరుతో అమలు చేస్తోన్న పథకంలో కేవలం ఏడు పంటలకు మాత్రమే పరిమితం అయిందని తెలిపారు. కూలీ రేట్లు పెరగడంతో ఉత్పాదక ఖర్చులు 20 శాతానికి పైగా అదనంగా పెరిగాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More : KCR: ద‌ళితుల కోసం ఇంకో సంచ‌ల‌న హామీ ఇచ్చిన కేసీఆర్‌

ఆ విష‌యాలు కెలికిన రేవంత్‌…
రూ. లక్ష రుణమాఫీ చేస్తామని 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని కేసీఆర్ స‌ర్కారుపై రేవంత్ ఫైర‌య్యారు. రుణం మాఫీ కాకపోవడం, మాఫీ అవుతుందని రైతులు బాకీ చెల్లించకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త అప్పులు ఇవ్వడం లేద‌ని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం 24 గంటలూ హుజూరాబాద్ ఎన్నికలలో గెలుపు కోసం ఎత్తులు జిత్తులు వేసుకునే పనిలో మునిగిపోయారని మండిప‌డ్డారు. మూడు వేల కోట్లు ఖర్చు చేసైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలవాలన్న పట్టుదలతో ఉన్న మీకు రైతులకు వెయ్యి కోట్లు సాయం చేయాలన్న ధ్యాస లేకపోడవం శోచనీయమ‌ని విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు డిమాండ్లు రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుంచారు.

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!