NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Reavnth Reddy: రేవంత్ రెడ్డి, ష‌ర్మిల ఒకే మాట మీద ఉన్నారుగా!

Reavnth Reddy: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి , వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల ఓ విష‌యంలో ఒకే మాట మీద ఉన్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. రైతుల సంక్షేమంలో కీల‌క‌మైన పంటల బీమా పాలసీ విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు వేర్వేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసిన నేప‌థ్యంలో ఈ టాక్ వ‌స్తోంది. తాజాగా కురిసిన భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జ‌రిగిన న‌ష్టంపై ఈ ఇద్ద‌రు నేత‌లు స్పందించారు.

Read more: Revanth reddy: సెంటిమెంట్‌తో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

లేఖ‌తో రేవంత్‌…
పంట న‌ష్టంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వారం రోజులుగా కురుస్తున్న రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్ర పంట నష్టం జ‌రిగింద‌న్నారు. రైతుల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వరద పాలైన పరిస్థితి కళ్లముందు కనిపిస్తోందని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట న‌ష్టం అంచ‌నా వేయించే వారని పేర్కొన్న రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఎన్నడూ చేపట్టిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాలను సైతం అటకెక్కించారని మండిప‌డ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి పంటల బీమా యోజన పథకం కానీ, సవరించిన వాతావరణ పంటల బీమా పథకం కానీ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మండిప‌డ్డారు. ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందన్న దురుద్ధేశంతో పథకానికి మంగళం పాడారు అని విరుచుక‌ప‌డ్డారు.

read more: KCR: రిటైరైన వారికి మ‌ళ్లీ ఉద్యోగం.. ఇది కేసీఆర్ స‌ర్కారులోనే సాధ్యం.

ష‌ర్మిల ఏమంటున్నారంటే..
పంటల బీమా పాలసీని తెస్తామని గొప్పగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. అటు కేంద్ర బీమా వర్తించక.. ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక రైతులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. అన్నదాతలు నష్టాల పాలవుతున్నారని.. ఇప్పుడైనా కేసీఆర్ మేలుకోవాలన్నారు. అవ్వ పెట్టది అడక్కు తిననీయదన్నట్లు కేసీఆర్ దొర తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి తెలంగాణ ప్రభుత్వం గతేడాది తప్పుకుంది.

author avatar
sridhar

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju