NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్టు .. నివాసం వద్ద టెన్షన్ టెన్షన్

Share

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ జేఏసీ నేతృత్వంల నేడు ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ మహా దీక్ష జరగనున్నది. ఈ దీక్షకు రేవంత్ హజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీక్షకు ముఖ్య అతిధిగా హజరై రేవంత్ రెడ్డి సంఘీభావం తెలపనున్నారు. అయితే దీక్షలు పోలీసులు అనుమతి లేదంటున్నారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లకుండా అరెస్టు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Revanth Reddy House Arrest

 

ఓయూకి వెళ్లి తీరతానని రేవంత్ చెబుతుండగా, దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. మరో పక్క రేవంత్ ఓయూకు వస్తే అడ్డుకుంటామని బీఆర్ఎస్‌వీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

గృహ నిర్బంధం చేయడంపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “పోలీసులను పంపి, నన్ను గృహ నిర్బంధఓం చేయడం కాదు.. కేసిఆర్ – కేటిఆర్ లకు దమ్ముంటే టీఎస్ఫీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంపై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల సమక్షంలో చర్చకు రావాలి” అంటూ సవాల్ విసిరారు. “మీరు సచ్చీలురైతే, స్కామ్ లో మీ పాత్ర లేకపోతే నా సవాల్ ను స్వీకరించాలి” అని రేవంత్ రెడ్డి కోరారు. తన నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసిన వీడియోను రేవంత్ రెడ్డి షేర్ చేశారు.

ఫలించిన చంద్రబాబు వ్యూహం.. ఎమ్మెల్సీగా ఎన్నికైన పంచుమర్తి అనురాధ


Share

Related posts

గంజాయి నూనె గురించి  తెలుసుకోండి !!

Kumar

మాస్ మహారాజాను అలాంటి రోల్ లో ఊహించుకోగలమా?

sowmya

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

Mahesh