Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!

Share

Revanth Reddy: కేసిఆర్ జనాలను సమ్మోహనపరిచే మాటల మాంత్రికుడు, రాజకీయాల్లో చాణిక్య నీతి తెలిసిన నేత, ప్రత్యేక తెలంగాణ సాధనకు బలమైన ఉద్యమాన్ని నడిపి సాధించిన నాయకుడు. జాతీయ పార్టీ కాంగ్రెస్ ను రాష్ట్రంలో పదేళ్ల వరకూ కోలుకోలేని దెబ్బతీసిన రాజకీయ వేత్త. ఇతర రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు అవసరం అవుతారేమో కానీ కేసిఆర్ కు రాజకీయ వ్యూహకర్తలు అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. కేసిఆర్ దెబ్బకు తెలంగాణలో కూదేలైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత పుంజుకుంటోంది. ఆ పార్టీ నేతల్లో పార్టీ బలోపేతం అవుతోందన్న ఆశలు చిగురిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలో దళిత దండోరా సభలను నిర్వహిస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ ఏర్పాటు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది సీనియర్, జూనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు టీఆర్ ఎస్ గూటికి చేరిపోగా కొందరు బీజేపీలోకి చేరిపోయారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభం అవుతున్నాయి.

Revanth Reddy key comments on kcr
Revanth Reddy key comments on kcr

2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను అధికారంలో రాకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ ఎత్తులను చిత్తు చేసి ఎలాగైనా అధికారాన్ని నిలుపుకునేందుకు గులాబీ బాస్ కేసిఆర్ తనదైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా దళితుల ఓటు బ్యాంక్ ను క్యాష్ చేసుకునేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు కేసిఆర్. దానికి తోడు వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హూజారాబాద్ నియోజకవర్గంలోనే అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోని మండలాల్లో అమలునకు చర్యలు చేపట్టారు. ఈ విషయంలోనూ విమర్శలు ఎదురు కాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేశారు కేసిఆర్. సమీక్షా సమావేశానికి బట్టి విక్రమార్కను కేసిఆర్ ఆహ్వానించారు. దీంతో ముఖ్యనేతలతో చర్చించి పార్టీ ఆమోదంతో బట్టి విక్రమార్క సమీక్షా సమావేశానికి హజరైయ్యారు.

ఇదే సమయంలో గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి కేసిఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మనలోనే చిచ్చు పెట్టాలని నక్కజిత్తుల కేసిఆర్ చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసిఆర్ బలవంతుడు కాదు కానీ ఆయన జిత్తులను ఎదుర్కొని అప్రమత్తంగా ఉండి పని చేయాలని నేతలను కోరారు. కేసిఆర్ నక్కజిత్తులు ఉంటాయనీ, ఆయన మాటలు, మంత్రాలు ఎదుర్కొని పని చేయాలన్నారు. తన కుర్చీని కాపాడుకునేందుకు కేసిఆర్ కాంగ్రెస్ ను చీల్చే కుట్రలు పన్నుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. గజ్వేల్ కోటను కొల్లగొడితేనే తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు. గజ్వేల్ నుండే కేసిఆర్ పతనం మొదలు పెట్టాలనీ, గజ్వేల్ లో దండు కట్టి కేసిఆర్ మీద దండ యాత్ర ప్రారంభించాలన్నారు.


Share

Related posts

లాక్ డౌన్ కంటే అన్ లాక్ లోనే జాగ్రత్తగా ఉండాలి.. మన్ కీ బాత్ లో ప్రధాని

Muraliak

puducherry : పుదుఛ్చేరిలో కాంగ్రెస్ కూటమికి షాక్ ల మీద షాక్ లు… మరో ఇద్దరు అవుట్

somaraju sharma

Today Gold Rate: తటస్థంగా బంగారం.. వెండి పైపైకి.. నేటి రేట్లు ఇలా..

bharani jella