NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth reddy: టీ కాంగ్రెస్ లో నూతనోత్సాహం నింపిన ఇంద్రవెల్లి సభ..! రేవంత్ పాస్ అయినట్లేగా..!?

Revanth reddy: ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంద్రవల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కోలుకోలేని రీతిలో చతికలపడ్డ కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు రేవంత్ నింపగలడు అన్న ఆశాభావాన్ని కల్గించారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో దీనిపై అందరి చూపు పడింది. అయితే ఈ సభకు అంచనాలకు మించి జనాలు హజరుకావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Revanth reddy 's dalit girijana dandora grand success in indravelli
Revanth reddy s dalit girijana dandora grand success in indravelli

టీపీసీసీకి రేవంత్ ని ఎంపిక చేసి కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దళితులను దగ్గర చేర్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా కేసిఆర్ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తరుణంలోనే దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రేవంత్ నింపిన జోష్ తో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. పార్టీకి చెందిన ప్రముఖ నేతలు అందరూ సభకు హజరైయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, పీసీసీకి పోటీ పడి భంగపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మినహా పార్టీకి చెందిన సీనియర్ నేతలు అందరూ కార్యక్రమానికి హజరైయారు. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా కొండ సురేఖ కూడా పాల్గొని ఇంద్రవెల్లి చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం పలికారు. సభా నిర్వహణ మొత్తం సీతక్క చూసుకున్నారు.

ఈ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం దళిత గిరిజనుల్లో ఆసక్తి రేపింది. సభకు వస్తున్న సామాన్య జనాన్ని కేసిఆర్ సర్కార్ ఎక్కడికక్కడ నిలిపేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసిఆర్ సర్కార్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు పెద్ద పీట వేసింది, వేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనంటూ పలు ఉదాహారణలు చెప్పారు రేవంత్. దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ గుర్తు చేశారు. కేసిఆర్ కు ఎన్నికలకు వస్తేనే దళితులు గుర్తుకు వస్తారని, కెసిఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటే దక్కలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసిఆర్ ఏమి చేశారని ప్రశ్నించారు. ఉప ఎన్నిక ఉందని హూజూరాబాద్ లో దళితులకు రూ.10లక్షలు అంటున్నారనీ, 118 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలని అప్పుడే అన్ని నియోజకవర్గాలకు దళిత బంధు వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ నెల 18న దళిత, గిరిజన దండోరా మోగిస్తామని రేవంత్ పేర్కొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju