NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఇటు కేటీఆర్‌ను అటు కిష‌న్ రెడ్డిని కెలికిన రేవంత్‌

Revanth Reddy: పీసీసీ ర‌థ‌సార‌థిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి త‌న మాట‌ల దూకుడు కొన‌సాగిస్తున్నారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ నేత‌ల‌ను టార్గెట్ చేశారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి , రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై రేవంత త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. TRSలో ఉన్న టాప్ లీడర్లంతా తెలుగుదేశం వాళ్లేన‌ని రేవంత్ రెడ్డి అన్నారు. తాను టీడీపీ అయితే కేసీఆర్ ఏంటని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను చంద్రబాబు దగ్గర సహచరుడిలా పనిచేస్తే…. కేసీఆర్ బానిసలా ఉన్నాడని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Revanth Reddy: రేవంత్ పై అదిరిపోయే కామెంట్ చేసిన హ‌రీశ్

మ‌ళ్లీ ముంద‌స్తుకు పోనున్న కేసీఆర్‌…
కేసీఆర్ జీవితం, జీవనం మొత్తం తెలుగుదేశమే కదా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కేసీఆర్, కేటీఆర్ లకు తెలుగుదేశం భిక్ష వేస్తే… హరీశ్ రావుకు కాంగ్రెస్ భిక్ష పెట్టిందన్నారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే తోపు అయిపోరన్నారు. కేటీఆర్ లా తాను రెడీ మేడ్ కుర్చీలో కూర్చోలేదన్నారు. హిమన్షును కేటీఆరే చెడగొడుతున్నారన్నారు. కేటీఆర్ అని పిలుస్తే..ఎన్టీఆర్ పరువు తీసినవాళ్లం అవుతామన్నారు. జలవివాదంలో జగన్, కేసీఆర్ లవి.. సురభి నాటకాల‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్ సర్కారు మళ్లీ ముందస్తు ఎన్నికలే వస్తాయని, 2023 మొదట్లోనే ముందుగా సర్కారును రద్దు చేసి, కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని రేవంత్ అన్నారు.

Read More: Revanth Reddy: రేవంత్ టీం ఒక మాట అంటే కేసీఆర్ మ‌నుషులు ప‌ది మాట‌లు అంటున్నారుగా….

కిష‌న్ రెడ్డి పై సెటైర్లు…

సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి కి ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో తన వల్లే ప్రమోషన్ వచ్చిందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రావడం వల్లే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా వచ్చిందన్నారు. ‘కిషన్ రెడ్డి దమ్మున్న నాయకుడు కాదు.. వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించడానికి వెళ్తే కనీసం ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కూడా రాలేదు’ అని చెప్పారు. ఎన్డీయే సర్కార్‌‌లో తెలుగు ప్రజలపై చిన్న చూపు చూస్తున్నారని, అందుకే కేంద్ర మంత్రి పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో 10 మంది కేంద్ర మంత్రులయ్యారని గుర్తు చేశారు.

author avatar
sridhar

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju