NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: ఈటలనే కాదు మరో ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలంటున్న కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి

Revanth Reddy: భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసిఆర్ వెంటనే స్పందించి వెంటనే విచారణకు ఆదేశించడం, ఆ మరుసటి రోజే మంత్రిత్వ శాఖ తొలగించడం, తదుపరి మంత్రివర్గం నుండి బర్తరఫ్ హుటాహుటిన జరిగిపోయాయి. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి మరో వ్యవహారాన్ని బయట పెట్టి మరో ఇద్దరు మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy serious comments on kcr
Revanth Reddy serious comments on kcr

గతంలో ఓ పర్యాయం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా అవినీతి ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా ఉపేక్షించేది లేదనీ అన్నారనీ, చివరకు తన కుమారుడు చేసినా శిక్షార్హుడేనని అన్నారనీ గుర్తు చేస్తూ కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దేవరయాంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల ఆక్రమణపై విచారణ జరిపించాలని కోరారు. ఆ ఆక్రమణల భూముల వ్యవహారంలో కేసిఆర్ కుటుంబం, సన్నిహితులకు హస్తం ఉందని ఆరోపించారు. నిషేదిత జాబితాలో ఉన్న 437 సర్వే నెంబర్ మంత్రి కేటిఆర్, ఓ పత్రిక సీఎండీ దామోదర్ రావు కు భూములు ఉన్నాయన్నారు. వాటికి సేల్ డీడ్ కాపీలను మీడియా ముందు బయటపెట్టారు.

ఒక ఎంపిగా ఆ భూమల వివరాలు అడిగితేనే ఇవ్వడం లేదనీ అన్నారు. 95 ఏళ్ల కు దేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలు బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేస్తూ వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి బండారం బయటపడుతుందనే వాటి రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈటలను తొలగించినట్లుగానే మంత్రులు కేటిఆర్, మల్లారెడ్డి లను తొలగించాలని కోరారు. వారు మంత్రులుగా ఉంటే రికార్డులను తారు మారు చేయించే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. .రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రేవంత్ చేసిన ఆరోపణలపై కేసిఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju