RS Praveen Kumar: ఆర్ఎస్ ప్ర‌వీణ్ టార్గెట్ కేసీఆర్‌యేనా? ఆ మాట‌ల అర్థం అదే క‌దా?

Share

RS Praveen Kumar: సీనియ‌ర్ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ త‌న ప‌ద‌విని వీడుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ తెలంగాణలో బీఎస్‌పీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆయన బిఎస్‌పి అధినేత్రి మాయావతిని కలవనున్నట్లు చెప్తున్నారు. మ‌రోవైపు త్వరలో జరిగే హుజూరాబాద్‌ ఉపఎన్నికలో తాను ఒక పార్టీకి మద్దతిస్తున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపిఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. దీంతో తాజాగా ట్విట్ట‌ర్లో జ‌రిగిన చ‌ర్చ‌, గ‌తంలోని ఘ‌ట‌న‌లు టార్గెట్‌ కేసీఆర్ ఎజెండాతో ఆయ‌న ముందుకు సాగుతున్నార‌ని చెప్తున్నారు.

Read More: RS Praveen Kumar: బీఎస్‌పీలోకి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌… సాక్షాత్తు మాయ‌వ‌తి ఏం చెప్పారంటే…

ప్ర‌వీణ్ క్లారిటీ..

ట్విట్టర్‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక‌పై ప్ర‌వీణ్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుందని, హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఆయా పార్టీలు వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలని సూచించారు. వీఆర్‌ఎస్‌ తీసుకున్న తాను ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని, ఉన్నత ఆశయంతో ముందుకు వెళ్తున్న తనను వివాదాల జోలికి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. వివాదాల్లోకి లాగితే అంచనాలు తలకిందులవుతాయని రాజకీయ పార్టీలకు సూచించారు. ఆస‌క్తిక‌రంగా ఆ మ‌రుస‌టి రోజే టీఆర్ఎస్ నేత‌పై విరుచుకుప‌డ్డారు.

Read More : Eatela Rajendar :ఈట‌ల రాజేంద‌ర్ కోలుకోలేని దెబ్బ తీసే పాచిక వ‌దిలిన కేసీఆర్

ఆ ముఖ్య‌మైన కార్య‌క్రమంపై ఫైర్‌…
హుజూరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌ రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరారు. తన సన్నిహితులు, మద్దతుదారులతో భారీగా టీఆర్ఎస్ భవన్‌కు చేరుకున్న కౌశిక్‌ను స్వయంగా సీఎం కేసీఆరే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్ మద్దతుదారులను కూడా కేసీఆర్ గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి స్వాగతించారు. అయితే ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి తీరుపై మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఆధిపత్య కులాల నాయకులను ‘గారు’ అని సంబోధించి, పీడిత వర్గాల నేతలను ఏకవచనంతో పిలవడంపై ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కార్యక్రమంలో కౌశిక్ మాట్లాడిన వీడియోను ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్య కులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నరు. ప్రత్యేకంగా ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ దీన్ని తప్పక ఆపితీరాల్సిందే’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇలా టీఆర్ఎస్ ప‌థ‌కాలు, టీఆర్ఎస్ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌టం వెనుక టార్గెట్ అధికార పార్టీ అన్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతుందంటున్నారు.


Share

Related posts

గురజాలలో ఐటి తనిఖీల కలకలం

somaraju sharma

Keerthi Suresh: కీర్తి సురేష్ యోగ చేస్తున్న వీడియో చూశారా..!!

bharani jella

ANR: అక్కినేని నాగేశ్వర రావు కెరీర్‌లో నాన్ స్టాప్‌గా 365 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ క్రియేట్ చేసిన ఒకే ఒక్క సినిమా అదే

GRK