NewsOrbit
Featured తెలంగాణ‌ న్యూస్

ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్‌టీఏ కొరఢా..! ప్రత్యేక తనిఖీలు..! కేసులు నమోదు..!!

సంక్రాంతి పండుగ సీజన్ వచ్చింది అంటే వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు అందరూ సొంతూళ్లకు పయనం అవుతుంటారు. సంక్రాంతి పండుగ వేళ ఆర్‌టీసీ కూడా 50 శాతం అదనపు చార్జీలతో ప్రత్యేక బస్సు సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడుపుతూ ఉంటుంది. అదే మాదిరిగా వందలాది ప్రైవేటు వాహనాలు జాతీయ రహదారులపై రుయ్ రుయ్ మంటూ దూసుకు పోతుంటాయి. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు బస్సును నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. అదనపు చార్జీలు వసూలు చేయడంతో పాటు ఓవర్ లోడ్ (సీటింగ్ కెపాసిటీకి మించి) ప్రయాణీకులను ఎక్కించుకుని వెళుతుంటాయి.

ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్‌టీఏ కొరఢా..! ప్రత్యేక తనిఖీలు..! కేసులు నమోదు..!!
RTA officers inspecting private travels buses cases registered

ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ ఆర్‌టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. మంగళవారం వేకువజామున హైదరాబాదు శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద, పెద్ద అంబర్ పేట ఓటర్ రింగ్ రోడ్డు వద్ద, బెంగళూరు హైవే మార్గంలో తొండుపల్లి 44వ జాతీయ రహదారిపై శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్ టీ ఏ అధికారులు తనిఖీ చేశారు.

ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్‌టీఏ కొరఢా..! ప్రత్యేక తనిఖీలు..! కేసులు నమోదు..!!
RTA officers inspecting private travels buses cases registered

ఎల్బీనగర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేయడంతో పాటు మరో ఆరు బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా ప్రయాణీకుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ టీ ఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయాణీకులతో పాటు లగేజీ ని కూడా రవాణా చేస్తున్న బస్సులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.  నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వల్ల తరచు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju