NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Sama Venkata Reddy Resigns TRS: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన వేళ కేసిఆర్ కు సీనియర్ నేత సామ బిగ్ షాక్..!!

Sama Venkata Reddy Resigns TRS: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో ఇంకా తెలియదు కానీ తెలంగాణ రాజకీయ వాతావరణం ఇప్పటి నుండి వేడెక్కుతోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభం అయ్యాయి. ఇది ఊహించని పరిణామమే అని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వేరే పార్టీలకు చేరడమే కానీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు చాలా తక్కువ. ఒక వేళ ఒకరో ఇద్దరో పార్టీలో చేరినా కొద్ది రోజుల్లోనే సొంత గూటికి వెళ్లిపోయారు. అయితే రేవంత్ రెడ్డి ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ తో గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన నేతలు, గతంలో టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేతలు, టిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

Sama Venkata Reddy Resigns TRS
Sama Venkata Reddy Resigns TRS

ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా హుజారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డి నిన్న సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే బలమైన యవనేత టీఆర్ఎస్ లో చేరుతున్నాడని ఆ పార్టీ సంతోషిస్తుండగా ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవనీయకుండా టీఆర్ఎస్ కు సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామ వెంకట రెడ్డి  ఆ మండలి కార్యవర్గ సభ్యులందరితో కలిసి టీఆర్ఎస్ కు బైబై చెప్పి ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.  పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో ఇన్ అయిన వేళ సీనియర్ నేత సామ వెంకట్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఊహించని షాక్‌యే.

టీఆర్ఎస్ నుండి బయటకు వెళ్లిన సామ వెంకట రెడ్డి పార్టీలో చిన్న స్థాయి నాయకుడు ఏమీ కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేసిన నేత. అందుకే కేసిఆర్ ఆయనకు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పదవి ఇచ్చారు. సామ వెంకటరెడ్డి తన పదవిని వదిలివేయడంతో పాటు మండలి కార్యవర్గ సభ్యులతోనూ రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీకి తీసుకువెళుతున్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వెంకట రెడ్డి ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ తో సమావేశమైయ్యారు. ఈ పరిణామాలు చూసిన వారు రేవంత్ వ్యూహం మామూలుగా లేదుగా అంటున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju