NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఆ కేసులో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట

తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పై ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.

supreme court

 

తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలకు ఇబ్బందులకు గురి కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ప్రతివాదనలు అందరూ కౌంటర్ అఫిడవిట్ లు దాఖలు చేయాలనీ, ఆ తర్వాత ఆరు వారాల్లోగా వాటికి సమాధానంగా రీజాయిండర్లు దాఖలు చేయాలని పిటిషన్ ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది.

MLAs poaching case: సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు లభించని ఊరట.. విచారణ 27వ తేదీకి వాయిదా

author avatar
sharma somaraju Content Editor

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!