Screaming snake: అరిచే పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో చూడండి..!!

Share

Screaming snake: కరీంనగర్ ‌జిల్లో రామడుగు మండలంలో ఓ వింత చోటుచేసుకుంది. మండలంలోని వెల్చాల గ్రామంలో ఓ వింత పాము కలకలం రేపింది. వింతగా అరిచే పాము ప్రజలకు కనిపించడం సంచలనంగా మారింది. వెలిచాల గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గామస్తులు చూశారు. ఆ పాము నోరు తెరిచి వింత అరుపులు చేయడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. పాము అరుస్తుంటే కొందరు తమ సెల్ ఫోన్ లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అరిచే పాములు కూడా ఉంటాయా అన్న చర్చ మొదలైంది.

Screaming snake in karimnagar dist
Screaming snake in karimnagar dist

Read More: YS Sharmila: కేసిఆర్ సర్కార్ పై మరో సారి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇలాంటి పాములు ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటన్నింటినీ పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాము వింతగా అరుస్తుండటంతో దాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఇలాంటి పామును తాము ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాము ఇలా అరవడం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు. జంతు శాస్త్రవేత్తలు ఈ పాముపై స్టడీ చేసి వివరాలు వెల్లడించాలని కోరుతున్నారు.


Share

Related posts

జీతం కోసం కాదు..! జీవితాల కోసం పనిచేస్తాం..!

bharani jella

Subiksha New HD Stills

Gallery Desk

ఆడ‌పిల్ల పుడుతుంద‌ని అమ్మడానికి ముందే ఒప్పందం.. చివరికి?

Teja