NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ .. కవిత ఇంటి వద్ద భారీ భద్రత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు 11 గంటలకు సీబీఐ అధికారులు కవిత నివాసానికి చేరుకుని లిక్కర్ స్కామ్ నకు సంబంధించి వారి వద్ద ఉన్న సందేహాలపై ప్రశ్నలను సంధించి సమాధానాలను రికార్డు చేయనున్నారు. సీబీఐ అధికారుల విచారణ నేపథ్యంలో కవిత నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కవిత నివాసం సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఇతరుల ప్రవేశాలను అనుమతించడం లేదు. టీఆర్ఎస్ కార్యకర్తలు అనవసరంగా అక్కడ గుమిగూడవద్దని, దర్యాప్తు ఏజన్సీకి సహకరించాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం సూచించినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఉదయం 11 గంటల నుండి సిబీఐ అధికారులు ఆమెను విచారించన్నారు.

TRS MLC Kavitha

 

సీబీఐ అధికారుల విచారణకు ఒక్క రోజు ముందు కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లేక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో కవితకు మద్దుతగా డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్.. వీ ఆర్ విత్ కవితక్క అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముందుగా సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన కవితను విచారించాలని నోటీసులు జారీ చేశారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల 6వ తేదీ విచారణకు అందుబాటులో ఉండనని, 11 నుండి 15వ తేదీ లోపు 13వ తేదీ మినహా ఏ రోజునైనా తాను అందుబాటులో ఉంటానని కవిత సీబీఐ అధికారులకు లేఖ రాశారు. కవిత లేఖపై 11వ తేదీ (నేడు) ఉదయం 11 గంటలకు విచారణకు సీబీఐ అధికారి అంగీకారం తెలియజేస్తూ మెయిల్ ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు.

TRS MLC Kavitha

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేకపోయినా తొలుత బీజేపీ నేతలు ఆమెపై ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసులో ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో కవిత వివరణను సీబీఐ అధికారులు తీసుకోనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీబీఐ అధికారులు ఆమెను ఎలాంటి ప్రశ్నలను అడుగుతారు, ఆ ప్రశ్నలకు కవిత ఏ విధమైన సమాధానాలు ఇస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!