Eatela Rajendar: ఈట‌ల బ‌ల‌హీనుడు, వ్య‌క్తిత్వం లేని మ‌నిషి… ఎవ‌రు అంటున్నారంటే…

Share

Eatela Rajendar: ఓ వైపు హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల హ‌డావుడి కొన‌సాగుతుంటే మ‌రోవైపు ఆ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా రాజకీయాలు జ‌ర‌పాల‌ని చూస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురించి ఆయ‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల బలహీన నేత అని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఈటల కలుస్తారని తాను ఊహించలేదని అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతానని చెప్పిన ఈట‌ల‌ బీజేపీలో చేరడం ఏంటో అర్థం కావడం లేదని ఆయ‌న అన్నారు. బీజేపీలో చేరడంతో ఈట‌ల వ్యక్తిత్వం కోల్పోయారన్నారు. ఈటల స్థాయి ఆయనే తగ్గించుకుని.. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడని జీవ‌న్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల‌కు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్‌

మా పార్టీ అలా కాదు..

త‌మ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌పై జీవ‌న్ రెడ్డి కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవరో నడపడని.. కాంగ్రెస్ ను నడిపిస్తుంది రాహుల్ గాంధీ అని అన్నారు. పీసీసీ అధ్య‌క్ష‌ పదవి కాంగ్రెస్ నాయకుడికే ఇస్తారని..బయటి వారు..కొత్త వారు అని ఉండదని జీవ‌న్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కునే శ‌క్తి కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌ని తెలిపారు.

Read More: Eatela Rajendar: స్పీక‌ర్ ఫార్మాట్లో ఈట‌ల రాజీనామా చేయ‌నిది ఇందుకేనా?

నియోజ‌క‌వ‌ర్గంలో ఈట‌ల హ‌ల్ చ‌ల్‌…

ఇదిలాఉండ‌గా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం ర్యాలీగా వెళ్లిన ఈటల.. కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో పర్యటించారు. ఢిల్లీ వెళ్లీ బీజేపీ నేతలను కలిసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఈటలకు.. కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కార్యకర్తలతో పాటు ఈటల రాజేందర్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో ర్యాలీ తర్వాత కమలాపూర్ మండల కేంద్రంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. అక్కడ తన అనుచరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్‌లో జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. అది ధర్మానికి, అధర్మానికి.. కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతుంది. అని వ్యాఖ్యానించారు.


Share

Related posts

చ‌లికాలంలో ఉసిరి చేసే మేలిది!

Teja

విజయసాయికి బుద్దా కౌంటర్

somaraju sharma

Scary dreams : పీడ కలలు రావడానికి కారణాలు తెలుసుకోండి?

Kumar