Subscribe for notification

కేసీఆర్ కు షాక్ …. సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్

Share

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఊహించ‌ని షాక్ ఇది. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం ఆయ‌న తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం విష‌యంలో అదే ప్ర‌జ‌ల నుంచి ఆయ‌న‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఎదుర‌వుతోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటిఆర్ స్పందించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

 

డ‌బుల్ బెడ్రూం ఇళ్లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల‌ల ప్రాజెక్టులో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఒక‌టి. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు అమ‌లులో జాప్యం జ‌రుగుతోంద‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్త‌యి గృహ ప్ర‌వేశాలు జ‌రిగాయి , జ‌రుగుతున్నాయి. అయితే, ఇలాంటి ల‌బ్ధిదారుల్లో కొంద‌రు తమ ఇళ్ల‌ను అమ్ముకుంటున్నార‌ట‌, అద్దెకు ఇచ్చుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యం ఆనోటా ఈనోటా మంత్రి కేటీఆర్ దృష్టికి చేరిన‌ట్లుంది . ఆయ‌న తాజాగా కీల‌క కామెంట్లు చేశారు.

 

కేటిఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని లంబాడి తండాలో నిర్మించిన 126 డబుల్ బెడ్రూం ఇళ్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. సిటీలో 9, 714 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన అన్నారు. లంబాడి తండాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం.. నాయిని నర్సింహ్మరెడ్డి ఆత్మకు శాంతి కలిగిస్తుందని ఆయన అన్నారు. సకల సౌకర్యాలతో నిర్మించి ఇస్తున్న ఈ ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులను ఆయన కోరారు. లబ్ధిదారులు ఇళ్లను అమ్మినా, కిరాయికి ఇచ్చినా.. పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో డ‌బుల్ ఇళ్ల కేంద్రంగా జ‌రుగుతున్న దందా ఈ స్థాయిలో ఉందా? అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ల‌బ్ధిదారులు చేస్తున్న ప‌ని తెలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ షాక్ తింటారు అంటూ  కామెంట్ చేస్తున్నారు.

కేటీఆర్ టూర్ … బీజేపీ పోరు

మ‌రోవైపు మంత్రి కేటీఆర్ బాగ్‌లింగంపల్లి పర్యటనలో స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పర్యటనలో ప్రొటోకాల్ పాటించలేదని బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ను పిలవకుండా… పాత కార్పొరేటర్‌ను పిలవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే, పాత పాలక మండలి గ‌డువు ముగియ‌నుందున ప్రోటోకాల్ పాటించామని అధికారులు వివ‌రించారు.


Share
sridhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

34 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

34 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

46 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago