23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేతకు నోటీసులు జారీ చేసిన సిట్

Share

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును వేగం పెంచింది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ అధికారులు సీఆర్పీసీ 41 నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఒక వేళ విచారణకు హజరుకాకపోతే అరెస్టు చేస్తామని కూడా తెలిపారు.

TRS MLAs poaching case

 

ఈ కేసులో ఫిర్యాదిదారుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన ప్రధాన నిందితులు రామచంద్రభారతి .. కేరళ ఎన్డీఏ నేత తుషార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేర్లను ప్రస్తావించినట్లుగా గుర్తించిన సిట్ అధికారులు ముందుగా తుషార్ కు నోటీసులు జారీ చేశారు. ఇదే క్రమంలో నిన్న రామచంద్రభారతి, సింహయాజిలకు విమాన టికెట్లు బుక్ చేసినట్లుగా భావిస్తున్న కరీంనగర్ కు చెందిన న్యాయవాది, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సన్నిహితుడుగా భావిస్తున్న శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేశారు. వీరిని కూడా ఈ నెల 21వ తేదీనే విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.

BL Santhosh

 

మరో పక్క సిట్ నోటీసులపై బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్ లో ప్రస్తావిస్తూ సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో ఇరికించేందుకు సిట్ నోటీసులు ఇచ్చి వేధిస్తొందని కావున వీటిపై స్టే ఇవ్వాలని కోరారు.


Share

Related posts

Today Horoscope: ఫిబ్రవరి 28 – మాఘమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ తారుమారవుతున్నాయా..?

GRK

TTD News: తిరుమల శ్రీవారికి రూ.కోట్ల విరాళం అందించిన భారత్ బయోటెక్..

somaraju sharma