NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిట్

TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మెమో ద్వారా మరో నలుగురు నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చింది. అయితే ఏసీబీ కేసును సిట్ విచారించే అర్హత లేదంటూ సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీనిపై సిట్ ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభాారతి, నందకుమార్, సింహయాజీలను విచారణ జరిపిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురుకి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందుకున్న వారిలో పలువురు కోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసులపై ఈ నెల 13వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.

Telangana High Court

ఈ కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన నాయకుడు తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాదులను ఏ 4, ఏ5, ఏ 6, ఏ 7గా నిందితుల జాబితాలో చేర్చి పోలీసులు ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. పోలీసుల మెమోను తప్పుబడుతూ 7వ నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మెమో జారీ చేసే విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

TRS MLAs poaching case

 

నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు శ్రీనివాస్ ను నిందితుడుగా చేర్చడాన్ని తప్పుబట్టింది. ఆయనకు రిలీఫ్ ఇస్తూనే పోలీసులు మెమోను కొట్టివేసింది. దీంతో శ్రీనివాస్ తో పాటు మిగిలిన నిందితులు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి పేర్లను ఎఫ్ఐఆర్ నుండి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిట్ హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju