NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్న సిట్

Share

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేశారన్న అభియోగంపై టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పై చర్యలకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. లీకేజీ కేసులో సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆరోపణలపై వివరణ కోరుతూ రేవంత్ రెడ్డికి ఇటీవల సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై రేవంత్ రెడ్డి ఇవేళ సిట్ కార్యాలయానికి చేరుకుని తన వద్ద ఉన్న వివరాలు వెల్లడిస్తూ కేటిఆర్ వ్యాఖ్యలపైనా సిట్ చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి కేటిఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్ అధికారి శ్రీనివాస్ కు వివరించారు.

Revanth Reddy

 

నేరస్తులను విచారించకుండా కేటిఆర్ పూర్తి సమాచారం చెప్పారని రేవంత్ రెడ్డి సిట్ అధికారులను కలిసిన తర్వాత మీడియాతో అన్నారు. కేటిఆర్ నుండి సమాచారం ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. కేసిఆర్ సర్కార్ ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని పేర్కొన్నారు. అయితే లీకేజ్ కేసులో రేవంత్ రెడ్డి ఎలాంటి ఆధారాలను ఇవ్వకపోవడంతో ఆయనపైనే నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కోణంలో చర్యలకు సిద్దమవుతోంది సిట్.  ఒకే మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. న్యాయ సలహాలు తీసుకొని రేవంత్ పై చర్యలు తీసుకుంటామని సిట్ పేర్కొంది.

కాగా రేవంత్ రెడ్డి విచారణ కు ముందు సిట్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనన్నాయి. విచారణలో భాగంగా హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు లిబర్టీ కూడలి వద్ద నిలిపివేయడంతో కారు దిగి కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంబించింది. రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి, పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైటాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష .. కానీ..


Share

Related posts

AP High Court: రాష్ట్రాల వారీగా మందుల కేటాయింపు వివరాలు ఇవ్వండి – కేంద్రానికి ఏపి హైకోర్టు కీలక ఆదేశం

somaraju sharma

Pawan Kalyan : వచ్చే ఏడాది మహేష్ బాబు తో పవన్ కళ్యాణ్..??

sekhar

మధ్య ప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం

Siva Prasad